West Godavari : ఎస్‌ఐ ఆత్మహత్యకు కారణం ఆ ఇద్దరేనా..!?
ABN , Publish Date - Feb 04 , 2025 | 05:18 AM
తణుకు రూరల్ ఎస్‌ఐగా పనిచేసిన ఆదుర్తి గంగ సత్యనారాయణమూర్తి(38) ఆత్మహత్య వ్యవహారం లో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి.

తణుకు రూరల్ ఎస్‌ఐ మూర్తిపై నాలుగు సార్లు చర్యలు
ఆ ఒత్తిడితోనే అఘాయిత్యం!
స్నేహితుడి ఆడియోలో కీలక విషయాలు
తణుకు రూరల్/భీమవరం క్రైం, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ ఎస్‌ఐగా పనిచేసిన ఆదుర్తి గంగ సత్యనారాయణమూర్తి(38) ఆత్మహత్య వ్యవహారం లో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. పోలీసుల వేధింపుల వల్లే వీఆర్‌లో ఉన్న ఎస్‌ఐ మూర్తి ఆత్మహత్య చేసుకున్నారని సోషల్ మీ డియాలో వైరల్ అవుతున్న ఆడియో ద్వారా తెలుస్తోంది. ఆడియోలో.. ఎస్‌ఐ మూర్తి చివరి గా తన స్నేహితుడితో మాట్లాడిన మాటలు ఉన్నాయి. మూర్తి తనకు జరిగిన అన్యాయం గురించి స్నేహితుని వద్ద వాపోయాడు. భా ర్య, పిల్లల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ గతంలో పనిచేసిన సీఐ నాగేశ్వరరావు, మరో సీఐ తనను ఇబ్బంది పెట్టడంతో తానిక్క డ పని చేయలేనని అన్నట్టు ఆ ఆడియోలో ఉంది. వీఆర్ నుంచి పోస్టింగ్ ఇచ్చినా కృష్ణా జిల్లాలో ఇస్తామంటున్నారని, అక్కడైతే తాను పని చేయలేనని, తూర్పుగోదావరి జిల్లాలో అడుగుతున్నానని, కానీ ఇక్కడ ఇచ్చే అవకాశం లేదని, ఈ పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని చెప్పారు. దీంతో అలాంటి ఆలోచనేమీ మనసులో పెట్టుకోవద్దని ఆయన మిత్రుడు వారించారు. కాగా.. మూర్తి మృతి అనంతరం ఆయన బంధువులు, బ్యాచ్‌కు చెందిన కొంద రు ఎస్‌ఐలు, మిత్రులు తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద, జిల్లా ఎస్పీ వద్ద.. ఈ వ్యవహారం పై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరా రు. ఇదిలావుంటే, మూర్తిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో గతంలో ఆయనపై నాలుగు సార్లు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.