Share News

MLA Kotamreddy: సజ్జల, కొమ్మినేనిపై ఎమ్మెల్యే కోటంరెడ్డి హాట్ కామెంట్స్...

ABN , Publish Date - Jun 11 , 2025 | 08:17 AM

Kotamreddy: పోరాటాలు చేసే వారిపై సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన దుర్మార్గమైన వ్యాఖ్యలు ఆయనవి కావని.. వైఎస్ జగన్ చేసిన‌ వ్యాఖ్యలుగానే తాను‌ భావిస్తున్నానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. సజ్జల.. జగన్ దగ్గర గుమస్తా‌ అని.. రాష్ట్ర రాజకీయాలు, ప్రజలతో ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి అని అన్నారు.

MLA Kotamreddy: సజ్జల, కొమ్మినేనిపై ఎమ్మెల్యే కోటంరెడ్డి హాట్ కామెంట్స్...
MLA Kotamreddy Sridhar Reddy

Nellore: వైసీపీ నేత (YCP Leader) సజ్జల రామకష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy), జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు (Journalist Kommineni Srinivasa Rao)పై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ హాట్ కామెంట్స్ (Hot Comments) చేశారు. వారు సభ్యసమాజంలో‌ మనుషులుగా ఉండటానికి అర్హతలేని వ్యక్తులని, అమరావతి ప్రాంత మహిళలపై దారుణమైన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు పోరాటాలు చేస్తున్నారని, అసభ్యకర వ్యాఖ్యలు చేసినవారు, వారికి సహకరించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారని అన్నారు.


ఆ పోరాటాలు చేసే వారిపై సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన దుర్మార్గమైన వ్యాఖ్యలు ఆయనవి కావని.. వైఎస్ జగన్ చేసిన‌ వ్యాఖ్యలుగానే తాను‌ భావిస్తున్నానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. సజ్జల.. జగన్ దగ్గర గుమస్తా‌ అని.. రాష్ట్ర రాజకీయాలు, ప్రజలతో ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి అని.. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని వ్యక్తి అంటూ దుయ్యబట్టారు. ఏపీలో అశాంతిని రేకెత్తించి, పెట్టుబడులను ఎదుర్కోవాలన్నదే వైసీపీ వైఖరి అని విమర్శించారు. ఇటు వంటి వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహారింవాలని సీఎంను కోరుతున్నానని కోటం రెడ్డి అన్నారు.


అమరావతి మహిళల పాదయాత్ర సమయంలో తాను పరామర్శిస్తే ప్రజలు హర్షించారని.. సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రోజు తనకు ఫోన్ చేసి.. పరామర్శ కాదు, దాడి చేసి ఉంటే బాగుండేదని స్వయంగా చెప్పారని అన్నారు. జర్నలిస్టు కొమ్మినేని తనకు 30 ఏళ్లుగా తెలుసునని.. డిబెట్‌లో తాను కూడా ఇంగ్లీషు పేపర్ చూశానన్నారు. ‘అయ్యా... కొమ్మినేని నీకు ఇంగ్లీష్ వచ్చా. ఇంగ్లీష్‌లో నా అన్నవి నువ్వు. నాకూ ఇంగ్లీషు రాదు.. నీకూ ఇంగ్లీషు రాదు. జర్నలిస్టులు అందరికీ కొమ్మినేనికి ఇంగ్లీషు రాదని తెలుసు’నని అన్నారు. కొమ్మినేని లాంటి అచ్చోసిన ఆంబోతులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరారు.


ఇవి కూడా చదవండి:

కత్తిని మింగిన పాము.. తర్వాత ఏం జరిగిందంటే..

అంతర్జాతీయ టెర్రరిజానికి తండ్రి పాకిస్థాన్...

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 11 , 2025 | 08:17 AM