Narayana Team: గుజరాత్‌లో మంత్రి నారాయణ బృందం పర్యటన
ABN , Publish Date - Apr 20 , 2025 | 09:06 AM
మంత్రి నారాయణ ఆది, సోమవారాల్లో గుజరాత్‌లో పర్యటించనున్నారు. మంత్రితో పాటు సీఆర్డీయే కమిషనర్ కన్నబాబు, ఏడీసీ ఛైర్‌పర్సన్ లక్ష్మీ పార్థసారథి, గ్రీనింగ్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసులు పర్యటనకు వెళ్తున్నారు.

అమరావతి: ఏపీ పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి నారాయణ (Minister Narayana) బృందం ఆది (Sunday), సోమవారాల్లో (Monday) గుజరాత్ (Gujarat)లో పర్యటించనుంది. అమరావతి నిర్మాణంలో (Amaravati development) భాగంగా పలు ప్రాంతాల్లో మంత్రి బృందం అధ్యయనం చేయనుంది. ఆదివారం ఏక్తా నగర్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం, పరిసర ప్రాంతాలను పరిశీలిస్తారు. అమరావతిలో నిర్మించే భారీ విగ్రహాల కోసం మంత్రి నారాయణ, అధికారులు అధ్యయనం చేయనున్నారు. అలాగే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీని పరిశీలిస్తారు. సోమవారం సబర్మతి రివర్ ఫ్రంట్‌ను పరిశీలించనున్నారు.
Also Read..: బీచ్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి
అహ్మదాబాద్‌లోని సీఈపీటీ (CEPT) యూనివర్సిటీ (సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ) సందర్శిస్తారు. అలాగే అహ్మదాబాద్‌లోని స్పోర్ట్స్ సిటీ, శివారులోని గిఫ్ట్ సిటీని పరిశీలించనున్నారు. మంత్రి నారాయణతోపాటు సీఆర్డీయే కమిషనర్ కన్నబాబు, ఏడీసీ ఛైర్‌పర్సన్ లక్ష్మీ పార్థసారథి, గ్రీనింగ్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసులు పర్యటనకు వెళ్తున్నారు.
కాగా వైసీపీ ప్రభుత్వం చెత్తపన్నుపై పెట్టిన శ్రద్ధ పారిశుద్ధ్యంపై పెట్టలేదని మంత్రి నారాయణ మండిపడ్డారు. మున్సిపాలిటీల నిధులను కూడా జగన్ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. పన్నులతో వచ్చే ఆదాయాన్ని.. మున్సిపాలిటీల అభివృద్ధికే కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. స్వచ్చాంధ్ర - స్వచ్ఛదివస్ కార్యక్రమంపై మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీర్లతో శనివారం మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్‌కు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండటంతో మొత్తం ఈ కార్యక్రమం బాధ్యతలు మంత్రి నారాయణకు అప్పగించారు. నెల్లూరులో లాంఛనంగా మంత్రి నారాయణ ప్రారంభించారు.
ముందుగా అల్లీపురంలోని డంపింగ్ కేంద్రాన్ని మంత్రి నారాయణ పరిశీలించారు. ఏపీ వ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని అధికారులకు నారాయణ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.... అన్ని మున్సిపాలిటీల్లో ఈ - వేస్ట్ సేకరణ భారీగా చేయాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యేలు, అన్ని శాఖల అధికారులు, ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. ఈ - వేస్ట్ సేకరణ నిరంతరం జరిగేలా కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీల్లో ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై ర్యాలీ నిర్వాహణ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబుకు గవర్నర్, పవన్ జన్మదిన శుభాకాంక్షలు
క్షమాపణ చెప్పిన స్టార్ డైరక్టర్.
For More AP News and Telugu News