Share News

Nellore Rural Development: 60 రోజులు 339 పనులు

ABN , Publish Date - May 05 , 2025 | 05:00 AM

నెల్లూరు రూరల్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధికి మోడల్‌గా మార్చిన ఎమ్మెల్యే కోటంరెడ్డిని మంత్రి లోకేశ్‌ ప్రశంసించారు. కేవలం 60 రోజుల్లో 339 అభివృద్ధి పనులు రూ.41 కోట్లతో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశారు.

Nellore Rural Development: 60 రోజులు 339 పనులు

  • 811 నెలల్లోనే రూ.231 కోట్లతో కార్యక్రమాలు

  • నెల్లూరు రూరల్‌.. అభివృద్ధికి చిరునామా

  • ఎమ్మెల్యే కోటంరెడ్డికి లోకేశ్‌ అభినందనలు

అమరావతి, మే 4 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు రూరల్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధికి చిరునామాగా మార్చిన స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆయన బృందాన్ని విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ అభినందించారు. ‘ఇచ్చిన మాటకు కట్టుబడి రూ.41 కోట్లతో 339 అభివృద్ధి పనులు కేవలం 60 రోజుల్లోనే పూర్తి చేసి, ప్రజలకు అంకితం చేయడం రికార్డు’ అని ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 11 నెలల్లోనే నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ అభివృద్ధికి రూ.231 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారని, కోటంరెడ్డి కృషి అందరికీ ఆదర్శమని కొనియాడారు.

Updated Date - May 05 , 2025 | 05:02 AM