Share News

Nara Lokesh: అన్ని పార్టీ పోస్టులు త్వరితగతిన భర్తీ చేస్తాం: నారా లోకేష్

ABN , Publish Date - Nov 11 , 2025 | 06:53 PM

ప్రతిపక్షంలో ఉండి పోరాడినట్లే అధికారంలోనూ జోనల్ కోఆర్డినేటర్లు పని చేయాలని మంత్రి లోకేష్ దిశానిర్దేశం చేశారు. పెండింగ్‌లో ఉన్న అన్ని పార్టీ పోస్టులు త్వరితగతిన భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.

Nara Lokesh: అన్ని పార్టీ పోస్టులు త్వరితగతిన భర్తీ చేస్తాం: నారా లోకేష్
Nara Lokesh

అమరావతి, నవంబర్ 11: పెండింగ్‌లో ఉన్న అన్ని పార్టీ పోస్టులు త్వరితగతిన భర్తీ చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేష్ (Nara Lokesh) స్పష్టం చేశారు. అన్ని జిల్లాల్లో పార్లమెంటరీ పార్టీ కార్యాలయాలు, నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు స్థలాలు గుర్తించి త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, జోనల్ కోఆర్డినేటర్లతో మంగళవారం మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మంత్రి దిశా నిర్దేశం చేశారు. ఈ మేరకు మంత్రితో జోనల్ కోఆర్డినేటర్‌లు మంతెన సత్యనారాయణ రాజు, భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, బీదా రవిచంద్ర యాదవ్, దామాచర్ల సత్య, సుజయ్ కృష్ణ రంగారావు, దీపక్ రెడ్డి, కోవెలమూడి రవీంద్ర, వేపాడ చిరంజీవి రావు, మందలపు రవి, పెళ్లకూరు శ్రీనివాస రెడ్డి తదితరులు సమావేశమయ్యారు.


ప్రతిపక్షంలో ఉండి పోరాడినట్లే అధికారంలోనూ జోనల్ కోఆర్డినేటర్లు పని చేయాలని సూచించారు. పార్టీ అధికారం వచ్చిందని ఎవరూ నిర్లక్ష్యంతో ఉండకూడదని అన్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఉన్న కసి, అధికారంలోనూ కొనసాగాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకుని పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఇన్చార్జ్ మంత్రులతో సమన్వయం చేసుకుంటూ స్థానిక ఎన్నికల వ్యూహరచన చేయాలని ఆదేశించారు. జనసేన, బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్‌ల సమన్వయం ఎంతో కీలకముని పేర్కొన్నారు.


ఖాళీగా ఉన్న నియోజకవర్గాలకు తెలుగుదేశ పార్టీ ఇన్చార్జ్‌లను త్వరలోనే నియమిస్తామని మంత్రి ప్రకటించారు. ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు వెళ్లి పార్టీ వ్యవవాహారాలపై సమీక్షించాలన్నారు. ఎమ్మెల్యేలు తప్పనిసరిగా గ్రీవెన్స్ నిర్వహించేలా పర్యవేక్షించాలని కోరారు. అర్జీలు ఇచ్చే వారికి ఎమ్మెల్యే స్థాయి లేదా ఇన్చార్జ్ మంత్రి స్థాయిలోనే సమస్య పరిష్కారమవ్వాలని సూచించారు. ఎమ్మెల్యేలకు కార్యకర్తలకు సమన్వయం పెంచే బాధ్యత జోనల్ కోఆర్డినేటర్లదేనన్నారు. జోనల్ కోఆర్డినేటర్ల పనితీరును ప్రతీ నెలా సమీక్షిస్తామని చెప్పారు. జోనల్ కోఆర్డినేటర్లే పార్టీకి అన్నీ తామై వ్యవహరించాలని సూచించారు. ఇన్చార్జ్ మంత్రులకు ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం పెంచటం, ఎమ్మెల్యేలతో సమస్య ఉన్న చోట ఇన్చార్జ్ మంత్రిని కూర్చోపెట్టి పరీష్కరించే బాధ్యతను కోఆర్డినేటర్లు తీసుకోవాలని పేర్కొన్నారు. వైసీపీ పెట్టిన అక్రమ కేసులపై సమీక్షించి చట్టపరంగా పరీష్కరిద్దామని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

కర్నూలుకు అతిపెద్ద బేవరేజెస్ ప్లాంట్.. భారీగా ఉద్యోగాలు: మంత్రి టీజీ భరత్

సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును స్థాపించాల్సిన సమయం ఆసన్నమైంది: పవన్ కల్యాణ్

Updated Date - Nov 11 , 2025 | 06:53 PM