Share News

Minister Narayana: నేడు ఢిల్లీకి మున్సిపల్‌ అధికారులు

ABN , Publish Date - Jul 17 , 2025 | 04:44 AM

స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2024 అవార్డులు అందుకునేందుకు నేడు మున్సిపల్‌ మంత్రి నారాయణతో పాటు పలువురు అధికారులు ఢిల్లీకి వెళ్లనున్నారు..

Minister Narayana: నేడు ఢిల్లీకి మున్సిపల్‌ అధికారులు

  • స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు అందుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు

అమరావతి, జూలై 16(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2024 అవార్డులు అందుకునేందుకు నేడు మున్సిపల్‌ మంత్రి నారాయణతో పాటు పలువురు అధికారులు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో జరిగే ఈ బహుమతుల ప్రదానం కార్యక్రమానికి హాజరయ్యేందుకు అనుమతిస్తూ మున్సిపల్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల్లో సూపర్‌ స్వచ్ఛ లీగ్‌ సిటీస్‌ కింద విజయవాడ, గుంటూరు, తిరుపతి ఎంపికయ్యాయి. విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ తరఫున మంత్రి నారాయణ, గుంటూరు మేయర్‌ భాగ్యలక్ష్మి, కమిషనర్‌ ధ్యానచంద్ర అవార్డులు అందుకోనున్నారు. అలాగే గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ తరఫున స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌, మేయర్‌ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్‌ పి.శ్రీనివాసులు, తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ తరఫున మున్సిపల్‌ శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్‌ కుమార్‌, మేయర్‌ డాక్టర్‌ ఆర్‌ శిరీష, కమిషనర్‌ ఎన్‌.మౌర్య ఈ అవార్డులు అందుకోనున్నారు.

Updated Date - Jul 17 , 2025 | 04:44 AM