Mother Donates: 9 లీటర్ల తల్లిపాలు దానం
ABN , Publish Date - Jul 17 , 2025 | 05:44 AM
తల్లి పాలు అమృతం అని చెబుతుంటారు. ఇలాంటి తల్లిపాలను ఒకటి కాదు.. రెండు కాదు..

అనంత మాతృక్షీర నిధికి ఇచ్చిన మాతృమూర్తికి సత్కారం
అనంతపురం వైద్యం, జూలై 16(ఆంధ్రజ్యోతి): తల్లి పాలు అమృతం అని చెబుతుంటారు. ఇలాంటి తల్లిపాలను ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 9 లీటర్లు దానం చేసి ఎందరో చిన్నారుల ప్రాణాలు నిలబెట్టారు మాతృమూర్తి దర్శి లిఖిత. అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల మాతృక్షీర నిధికి ఆమె 9 లీటర్ల తల్లిపాలను దానం చేశారు. ఈ సందర్భంగా ఆమెను ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ఆత్మారామ్, ఆర్‌ఎంవో డాక్టర్ హేమలత బుధవారం సత్కరించారు. నవజాత శిశువులకు తల్లిపాలు అందించేందుకు సర్వజన వైద్యశాలలో ‘అనంత మదర్స్ మిల్క్ బ్యాంక్’ పేరుతో మాతృక్షీర నిధిని ఏర్పాటు చేశామని ఆత్మారామ్ తెలిపారు. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న లిఖితకు రెండు నెలల బాబు ఉన్నాడు. ఆమె బిడ్డకు పాలు ఇవ్వగా మిగిలినవి సేకరించి, మొత్తం 9 లీటర్లు దానంచేసి మాతృత్వాన్ని చాటుకున్నారని కొనియాడారు. అనంత మదర్స్ మిల్క్ బ్యాంక్‌కు తల్లిపాలను దానం చేయాలనుకునే వారు 8977768275 నంబరులో సంప్రదించాలని కోరారు.