MLA Prashanthi: జగన్ సార్.. మహిళలపై ఎందుకింత చిన్నచూపు
ABN , Publish Date - Jul 10 , 2025 | 04:09 AM
జగన్ సార్.. ఏం చేశామని మహిళల పట్ల మీనాయకులకు ఇంత చిన్నచూపు.

మీవాళ్లను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు: ప్రశాంతిరెడ్డి
బుచ్చిరెడ్డిపాళెం, జూలై 9(ఆంధ్రజ్యోతి): ‘జగన్ సార్.. ఏం చేశామని మహిళల పట్ల మీనాయకులకు ఇంత చిన్నచూపు. మీరు మీవాళ్ల దుర్మార్గాలను మందలించకుండా ఎందుకు ప్రోత్సహిస్తున్నారు’ అని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నెల్లూరు జిల్లా బుచ్చి నగర పంచాయతీలో ఆమె మీడియాతో మాట్లాడారు. అచ్చోసిన ఆంబోతులను ఊరి మీదకు వదిలి వాళ్లు చేసింది, మాట్లాడింది నిజమని అనిపిస్తారా అంటూ జగన్‌ను నిలదీశారు. ఇలాంటి నాయకులకు మహిళలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.