Ganta Srinivasa Rao: దమ్ము, ధైర్యం ఉంటే రా.. తేల్చుకుందాం.. జగన్‌కు గంటా శ్రీనివాసరావు సవాల్
ABN , Publish Date - Jun 19 , 2025 | 06:30 PM
విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అందరూ విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఇది కచ్చితంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అవుతుందని భావిస్తున్నామన్నారు.

విశాఖ: ఎన్నికల మేనిఫెస్టోపై దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రావాలని మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సవాల్ విసిరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటికే 80% పైగా తాము అమలు చేశామని, 80 శాతం హామీలను నెరవేర్చలేదని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని అన్నారు. జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఉబిలోకి నెట్టివేసినా... కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందన్నారు. అయితే, వైసీపీ నాయకులు తప్పుడు పనులు చేస్తున్నారు కాబట్టే రెడ్ బుక్ అంటే భయపడుతున్నారని గంటా శ్రీనివాసరావు కామెంట్స్ చేశారు.
డైలాగ్స్ కొడితే.. సింగిల్ డిజిటే
జగన్ వ్యవహార శైలి, భాష ఇంకా ఏ మాత్రం మారలేదని, గంగమ్మ జాతర లాంటి డైలాగ్స్ కొడితే.. జగన్ పార్టీ 11 స్థానాలు నుంచి సింగిల్ డిజిట్‌కి పడిపోతుందని అన్నారు. వైసీపీ మునిగిపోయిన పడవ అని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే ఋషికొండ భవనాలపై త్వరంలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. యోగ లాంటి మంచి కార్యక్రమాల్లో జగన్ పాల్గొనడని, కూటమి విజయోత్సవాలు అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన వలన వాయిదా పడిందని వివరించారు. ఈ విజయోత్సవాలు ఈ నెల 23న నిర్వహించాలని అనుకుంటున్నట్లు తెలిపారు.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్..
అంతర్జాతీయ యోగా దినోత్సవంపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని, ఇది కచ్చితంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అవుతుందని భావిస్తున్నామన్నారు. యోగా నిత్య జీవితంలో భాగం కావాలని సూచించారు. నిత్యం యోగా చేస్తే చాలా వరకు ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని, చరిత్రాత్మక ఘట్టానికి విశాఖ వేదిక అవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర కేబినెట్, అధికార యంత్రాంగం విశాఖలో ఉండి యోగ దినోత్సవం ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. యోగ దినోత్సవ వేడుకలలో లక్షలాదిమంది మంది భాగస్వామ్యం అవుతున్నారని, సచివాలయాన్ని యూనిట్ గా తీసుకొని రవాణా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. యోగ దినోత్సవ వేడుకలు సజావుగా జరగడానికి అందరూ సహకరించాలని కోరారు.
Also Read:
గంజాయి, బెట్టింగ్ బ్యాచ్‌లు, రౌడీలకు విగ్రహాలు పెడతారా: సీఎం చంద్రబాబు
యోగాపై ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసెస్: చంద్రబాబు
For More Telugu News