Amalapuram Missing Girl: మిస్సింగ్ అయిన బాలిక ఆచూకీ లభ్యం
ABN , Publish Date - Nov 11 , 2025 | 08:35 AM
కోనసీమ జిల్లా అమలాపురంలో నిన్న(సోమవారం) మిస్సింగ్ అయిన బాలిక ఆచూకీ లభ్యమైంది. పి గన్నవరం మండలం ఎర్రం శెట్టి వారి పాలెం వద్ద పాపను భవాని స్వాములు గుర్తించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కోనసీమ, నవంబర్ 11: అమలాపురంలో నిన్న(సోమవారం) మిస్సింగ్ అయిన బాలిక(Missing girl) ఆచూకీ లభ్యమైంది. పి గన్నవరం(P Gannavaram) మండలం ఎర్రం శెట్టి వారి పాలెం వద్ద పాపను భవాని స్వాములు గుర్తించారు. దీంతో బాలిక కుటుంబ సభ్యులతో పాటు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అమలాపురం పట్టణంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో సదరు బాలిక ఐదవ తరగతి చదువుతుంది. సోమవారం సాయంత్రం మేనమామ వరుస అయిన వ్యక్తి పాపను తన వెంట తీసుకెళ్లాడు. అతడు తొలుత కాకినాడ(Kakinada) తీసుకెళ్లి.. తిరిగి స్వగ్రామమైన పి గన్నవరంకు తీసుకొచ్చాడు. ఈ క్రమంలోనే బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. గాలింపు చర్యలు చేపట్టారు.
సోమవారం రాత్రి 10 గంటల సమయంలో సీసీ ఫుటేజ్ ని పోలీసులు(AP Police) పరిశీలించగా... కిడ్నాపర్ బాలికను తీసుకెళ్లినట్లు గుర్తించారు. పాపను తీసుకెళ్లిన కిడ్నాపర్.. పి గన్నవరం సమీపంలోని 20 ఎకరాల అరటితోటలో దాక్కున్నాడు. అమలాపురం పట్టణ సీఐ వీరబాబు ఆధ్వర్యంలో రాత్రంతా పాప కోసం పోలీసులు ముమ్మరంగా గాలించారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం కిడ్నాపర్.. పాపని బెల్లంపూడి వైపు నడిపించుకుంటూ తీసుకెళ్తుండగా భవానీ స్వాములు గుర్తు పట్టారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు పాప(missing child found)ను ఆమె తండ్రి కముజు రమణకు అప్పగించారు. మరోవైపు నిందితుడు పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాలిక తిరిగి తమ చెంతకు రావడంతో.. ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
10 పరీక్షల ఫీజు చెల్లింపునకు 25 వరకు గడువు