Minister Nadendla Manohar: బియ్యానికి గోడౌన్లు సిద్ధం చేయండి
ABN , Publish Date - Nov 11 , 2025 | 06:39 AM
ప్రజాపంపిణీ అవసరాల కోసం సీఎంఆర్ బియ్యాన్ని నిల్వ చేసేందుకు అవసరమైన గోడౌన్లను ముందుగానే సిద్ధం చేయాలని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్...
అధికారులకు మంత్రి నాదెండ్ల ఆదేశం
అమరావతి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): ప్రజాపంపిణీ అవసరాల కోసం సీఎంఆర్ బియ్యాన్ని నిల్వ చేసేందుకు అవసరమైన గోడౌన్లను ముందుగానే సిద్ధం చేయాలని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో పౌర సరఫరాలశాఖకు 20 లక్షల టన్నులు, భారత ఆహార సంస్థకు 14 లక్షల టన్నుల సీఎంఆర్ బియ్యం నిల్వ కోసం గోడౌన్లు అవసరమవుతాయని తెలిపారు. సోమవారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో రాష్ట్ర రైస్ మిల్లర్ల ప్రతినిధులతో మంత్రి సమావేశం నిర్వహించారు. పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు, కార్యదర్శి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.