Minister Narayana Team: అమరావతి కోసం అధ్యయనం
ABN , Publish Date - Apr 20 , 2025 | 03:56 AM
అమరావతి నిర్మాణానికి సంబంధించి గుజరాత్‌లోని పలు ప్రాంతాలను మంత్రి నారాయణ బృందం పరిశీలించనుంది. బృందం సర్ధార్ వల్లభాయ్‌పటేల్ విగ్రహం, గిఫ్ట్‌సిటీ, సబర్మతి రివర్‌ఫ్రంట్‌ను సందర్శించనుంది,

నేడు, రేపు మంత్రి నారాయణ బృందం గుజరాత్ పర్యటన
అమరావతి, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): అమరావతి నిర్మాణంలో భాగంగా గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో అధ్యయనానికి మంత్రి నారాయణ బృందం సిద్ధమైంది. సీఆర్‌డీఏ కమిషనర్ కన్నబాబు, ఏడీసీ చైర్‌పర్సన్ లక్ష్మీపార్థసారథి, గ్రీనింగ్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసులుతో కూడిన ఈ బృందం ఆది, సోమవారాలు గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో గల సర్ధార్ వల్లభాయ్‌పటేల్ విగ్రహాన్ని పరిశీలించనుంది. ఆదివారం మధ్యాహ్నం అహ్మదాబాద్ శివారులోని గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్‌సిటీ(గిఫ్ట్‌సిటీ)ని మంత్రి పరిశీలిస్తారు. అహ్మదాబాద్‌లోని సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ప్లానింగ్ టెక్నాలజీ యూనివర్సిటీని సందర్శిస్తారు. రాత్రికి అహ్మదాబాద్‌లోని స్పోర్ట్స్‌సిటీ పరిశీలిస్తారు. సోమవారం ఉదయం సబర్మతి రివర్‌ఫ్రంట్‌ను మంత్రి బృందం పరిశీలించనుంది.