Share News

Minister Nadendle: జగన్‌ బాధ్యత లేని వ్యక్తి

ABN , Publish Date - Jul 17 , 2025 | 03:58 AM

వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బాధ్యత లేని వ్యక్తి అని మంత్రి నాదెండ్ల మనోహర్‌ మండిపడ్డారు.

Minister Nadendle: జగన్‌ బాధ్యత లేని వ్యక్తి

అమరావతి, జూలై 16(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బాధ్యత లేని వ్యక్తి అని మంత్రి నాదెండ్ల మనోహర్‌ మండిపడ్డారు. పరిపాలనపై అవగాహన లేకుండా పచ్చి అబద్ధాలు చెబుతూ, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో సమాజంలో చీలికలు తీసుకువచ్చి రాజకీయంగా లబ్ధి పొందడానికి జగన్‌ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. గత ఐదేళ్లూ ముఖ్యమంత్రిగా ఉండి కనీసం గుంతలు కూడా పూడ్చలేకపోయిన జగన్‌ ఈ రోజు పాలన గురించి మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. విజయవాడలో మీడియాతో నాదెండ్ల మాట్లాడారు. ‘గత ఐదేళ్లలో సృష్టించిన ఆర్థిక విధ్వంసం నుంచి ప్రజలను కాపాడి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతామన్న నమ్మకంతోనే ప్రజలు కూటమికి పట్టం కట్టిన విషయాన్ని జగన్‌ మర్చిపోయారా?’’ అని మంత్రి ప్రశ్నించారు.

Updated Date - Jul 17 , 2025 | 03:58 AM