Share News

వైసీపీ కార్యాలయాలకు త్వరలో టూలెట్‌ బోర్డులు: డోలా

ABN , Publish Date - Feb 10 , 2025 | 05:56 AM

పార్టీ కార్యాలయాలకు టూలెట్‌ బోర్డులు పెట్టడం ఖాయమని మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ఎద్దేవా చేశారు.

వైసీపీ కార్యాలయాలకు త్వరలో టూలెట్‌ బోర్డులు: డోలా

ఒంగోలు, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): వైసీపీని ప్రజలు విశ్వసించడం లేదని, త్వరలో ఆ పార్టీ కార్యాలయాలకు టూలెట్‌ బోర్డులు పెట్టడం ఖాయమని మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ఎద్దేవా చేశారు. కొండపి నియోజకవర్గంలోని 41 మందికి రూ.43లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను, రూ.8 లక్షలకు ఎల్‌వోసీలను ఆదివారం మంత్రి తన స్వగ్రామమైన టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు దిగజారిన జగన్‌ అలా ఎందుకైందో కనీసం 11 నిమిషాలైనా ఆత్మవిమర్శ చేసుకున్న పరిస్థితి లేదన్నారు. ఐదేళ్ల పాలనలో వైద్య రంగాన్ని జగన్‌ సర్వనాశనం చేశారని డోలా ఆగ్రహం వ్యక్తంచేశారు.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News

Updated Date - Feb 10 , 2025 | 05:56 AM