Share News

Donations for Paakeeza: పాకీజాకు దాతల అండ

ABN , Publish Date - Jun 30 , 2025 | 04:50 AM

మానవత్వం పరిమళించింది. తీవ్రమైన ఆర్థిక కష్టాలతో, చివరికి భిక్షాటన చేసే దుస్థితికి చేరుకున్న సినీ నటి పాకీజా విషయంలో దాతలు ఉదారంగా స్పందిస్తున్నారు. ‘పాపం.. పాకీజా!’ శీర్షికన ఈ నెల 27న ‘ఆంధ్రజ్యోతి’ పతాక శీర్షికన ప్రచురించిన కథనానికి అనూహ్య స్పందన లభించింది.

 Donations for Paakeeza: పాకీజాకు దాతల అండ

రూ.2లక్షలు ఇచ్చేందుకు మహేష్ బాబు ఫ్యాన్స్‌ నిర్ణయం?

గుంటూరు, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): మానవత్వం పరిమళించింది. తీవ్రమైన ఆర్థిక కష్టాలతో, చివరికి భిక్షాటన చేసే దుస్థితికి చేరుకున్న సినీ నటి పాకీజా విషయంలో దాతలు ఉదారంగా స్పందిస్తున్నారు. ‘పాపం.. పాకీజా!’ శీర్షికన ఈ నెల 27న ‘ఆంధ్రజ్యోతి’ పతాక శీర్షికన ప్రచురించిన కథనానికి అనూహ్య స్పందన లభించింది. ఏపీ ప్రభుత్వ కరుణ కోసం గుంటూరు వచ్చిన ఆమె దీనగాథను ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తేవడంతో అనేక మంది స్పందించారు. ఆమెకు ఫోన్‌ పే ద్వారా సాయం అందించేందుకు ముందుకొస్తున్నారు. ఆదివారం ఒకానొక సమయంలో రోజువారీ ట్రాన్సాక్షన్ల సంఖ్య పరిమితి దాటిపోయి ఆమె ఫోన్‌ పే యాప్‌ జామైపోయింది. పెద్ద మొత్తంలో కాకపోయినా ఎక్కువ మంది ఒకేరోజు ఫోన్‌పే చేయడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలిసింది. ఇలా ఆదివారం రోజున రూ.30 వేల సాయం అందినట్లు తెలుస్తోంది. కాగా, ఆమెకు రూ.2 లక్షలు విరాళం అందించేందుకు రెండు తెలుగు రాష్ర్టాల మహే్‌షబాబు ఫ్యాన్స్‌ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. మహే్‌షబాబు నటించిన ‘అతడు’ సినిమా రీ రిలీజ్‌ సందర్భంగా ఆమెకు త్వరలో ఆమెకు కబురు పెట్టి ‘ఆంధ్రజ్యోతి’ సమక్షంలోనే ఈ సాయం అందించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దాతలు పాకీజాకు సాయం చేయదలచుకుంటే 81488 86254 అనే ఈ నంబరులో సంప్రదించవచ్చు.

Updated Date - Jun 30 , 2025 | 04:54 AM