Maha Sivaraththiri: మహా శివరాత్రి పర్వదినం.. మంత్రి ఆనంకు సీఎం కీలక ఆదేశాలు
ABN , Publish Date - Feb 10 , 2025 | 08:43 PM
Maha Sivaraththiri: శ్రీకాళహస్తిలో కొలువు తీరిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవం జరగనున్నాయి. ఇవి ఫిబ్రవరి 21వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

నంద్యాల, ఫిబ్రవరి 10: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. సీఎం ఆదేశాలతో.. సనాతన ధర్మం, ఆగమ శాస్త్ర పండితుల ఆలోచనతో ఈ శివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఫిబ్రవరి 23వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు.. శ్రీశైల భ్రమరాంబిక సమేత శ్రీ మల్లిఖార్జున స్వామి వార్లకు ప్రభుత్వం తరుఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. సోమవారం నంద్యాలలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. ఫిబ్రవరి 25, 26 తేదీలలో రెండు రోజుల పాటు శ్రీశైలం టోల్ గేట్ల వద్ద భక్తుల వాహనాలకు ఎటువంటి రుసుం లేకుండా ఉచితంగా అనుమతిస్తామన్నారు.
శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని.. శ్రీశైలంలో స్వామి వారిని దర్శించుకొనేందుకు.. అటవీ మార్గంలో వచ్చే భక్తులకు గిరిజన గ్రామాల్లో మంచి నీరు, ఆహారం అందించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేస్తామన్నారు. అయితే గత సంవత్సరం కంటే ఈ ఏడాది 30 శాతం మంది భక్తులు అధికంగా వస్తారని అంచనా వేస్తున్నామన్నారు.
అలాగే ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాల కోసం పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదే విధంగా స్వామి వారి దర్శనానంతరం భక్తులు సత్రాలకు వెళ్లేందుకు మినీ వ్యాన్లు సైతం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ఆనం వివరించారు.
Also Read: రంగరాజన్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్.. కీలక ఆదేశాలు
శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రధానమైన నాలుగు రోజులు.. భక్తులకు ఉచితంగా లడ్డూ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. స్వామి, అమ్మవార్ల దర్శనాలకు సామాన్య భక్తులకు అధిక సమయం కేటాయించి.. వీఐపీ దర్శన సమయాన్ని అవసరమైతే అర్ధగంట పాటు తగ్గించాలని ఇప్పటికే అధికారులకు సూచించామన్నారు.
Also Read: అప్పు చేయడం తప్పు కాదు కానీ..
ఇక భక్తుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. అందులోభాగంగా అన్ని ప్రదేశాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని.. అలాగే డ్రోన్ కెమెరాల ద్వారా భక్తుల రాకపోకలు పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు. రోప్ పార్టీలను ఏర్పాటు చేసి.. భక్తులను క్యూలైన్లలోకి పంపిస్తామని.. ఎక్కడా తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఈ మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శ్రీశైలం బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 వ తేదీన ప్రారంభంకానున్నాయి. ఇవి మార్చి 1వ తేదీతో ముగియనున్నాయి.
Also Read: సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల లేఖ.. ఎందుకంటే..?
మరోవైపు శ్రీకాళహస్తిలో కొలువు తీరిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవం జరగనున్నాయి. ఇవి ఫిబ్రవరి 21వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అయితే ఈ బ్రహ్మోత్సవాలకు రావాలంటూ స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సోమవారం అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడును కలిసి ఆహ్వానించారు.
Also Read: ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు.. జగన్ వస్తారా?
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు స్వామి వారి తీర్థ ప్రసాదాలతోపాటు చిత్ర పటాన్ని సీఎంకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలో జరుగతోన్న ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు గురించి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ అడిగి తెలుసుకున్నారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read : కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికకు వెల్లువెత్తిన నామినేషన్లు
Also Read: ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి
For AndhraPradesh News And Telugu News