Share News

Rayalaseema: బంగాళాఖాతంలో అల్పపీడనం

ABN , Publish Date - Jun 26 , 2025 | 05:04 AM

వాయవ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించింది

Rayalaseema: బంగాళాఖాతంలో అల్పపీడనం

విశాఖపట్నం, అమరావతి, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): వాయవ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో అదే ప్రాంతంలో గురువారం నాటికి అల్పపీడనం ఏర్పడనుంది. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో ఎక్కువచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ, ఉత్తర కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Updated Date - Jun 26 , 2025 | 05:04 AM