శ్రీమఠానికి బియ్యం, వెండి విరాళం
ABN , Publish Date - Oct 26 , 2025 | 12:09 AM
మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠానికి ముంబైకి చెందిన అశోక్ భట్ అనేభక్తుడు 10.50 క్వింటాళ్ల బియ్యం, 500 గ్రాముల వెండి వస్తువులు, రూపశెట్టి అనేభక్తురాలు 2.50 క్వింటాళ్ల బియ్యం విరాళంగా ఇచ్చినట్లు మఠం అధికారులు తెలిపారు.
మంత్రాలయం, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠానికి ముంబైకి చెందిన అశోక్ భట్ అనేభక్తుడు 10.50 క్వింటాళ్ల బియ్యం, 500 గ్రాముల వెండి వస్తువులు, రూపశెట్టి అనేభక్తురాలు 2.50 క్వింటాళ్ల బియ్యం విరాళంగా ఇచ్చినట్లు మఠం అధికారులు తెలిపారు. ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేష్ జోషి, సురేష్ కోణాపూర్ మాట్లాడుతూ భక్తులు శనివారం కుటుంబ సమేతంగా రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని 70 బస్తాల్లోని 13 క్వింటాళ్ల మేలురకమైన సోనాబియ్యం, వెండి పూజవస్తువులను విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు. విరాళం ఇచ్చిన దాతల కుటుంబానికి పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు రాఘవేంద్ర స్వామి మెమెంటో, శేషవస్త్రం, ఫల, పుష్ప, మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఐపీ నరసింహమూర్తి, అనంతపురాణిక్, రవికులకర్ణి, నారాయణ రావు, నరసింహ దేశాయ్, శ్రీపాధ ఆచార్ పాల్గొన్నారు.