Rayalaseema University: రాయలసీమ యూనివర్సిటీలో వేటకొడవలితో విద్యార్థి హల్చల్
ABN , Publish Date - Oct 31 , 2025 | 07:16 PM
రాయలసీమ యూనివర్సిటీలో ఓ విద్యార్థి వేటకొడవలితో హల్చల్ చేశాడు. సెల్ ఫోన్ విషయంలో గొడవ జరగడంతో..
కర్నూలు: రాయలసీమ యూనివర్సిటీ (Rayalaseema University)లో ఓ విద్యార్థి వేటకొడవలితో హల్చల్ చేయడం కలకలం రేగింది. సెల్‌ఫోన్ విషయంలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులు అజయ్ నాయక్, బాలాజీ నాయక్‌ల మధ్య గురువారం రాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఆగ్రహంతో ఉన్న అజయ్ నాయక్, శుక్రవారం ఉదయం బాలాజీ నాయక్ గది దగ్గరికి వెళ్లి వేటకొడవలితో బెదిరించినట్లు తెలుస్తోంది.ఈ దృశ్యాన్ని చూసిన ఇతర విద్యార్థులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.
విషయం తెలుసుకున్న యూనివర్సిటీ అధికారులు వెంటనే స్పందించి అజయ్ నాయక్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ఇవి కూడా చదవండి...
దారుణం.. భర్త సోదరుడిని సుఖ పెట్టాలంటూ..
పాండురంగ స్వామి ఉత్సవాలు.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి
Read Latest AP News And Telugu News