రమణీయం.. రథోత్సవం
ABN , Publish Date - Nov 21 , 2025 | 11:49 PM
మండలంలోని పార్లపల్లి, పరమాన్‌దొడ్డి, మల్కాపురం, దైవందిన్నె, వెంకటగిరి తదితర గ్రామాల్లో శుక్రవారం కార్తీక దీపోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
ఎమ్మిగనూరు రూరల్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పార్లపల్లి, పరమాన్‌దొడ్డి, మల్కాపురం, దైవందిన్నె, వెంకటగిరి తదితర గ్రామాల్లో శుక్రవారం కార్తీక దీపోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పార్లపల్లి గ్రామంలో ఉదయం నుంచి గిడ్డాంజనేయస్వామికి ప్రత్యేక పూజలతో పాటు సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సాయంత్రం స్వామి రథోత్స వంలో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. పరమాన్ దొడ్డి గ్రామంలో ఆంజనేయస్వామి ప్రభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. టీడీపీ మండల కన్వీనర్ కేటీ వెంకటేశ్వర్లు, టీడీపీ మండల మాజీ కన్వీనర్ మల్లికార్జున, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మంత్రాలయం: మండలంలోని సుంకేశ్వరి గ్రామంలో రామలింగేశ్వరస్వామి రథోత్సవం వైభవంగా ఊరేగించారు. శుక్రవారం ఉదయం నుంచి శివునికి, నందికి, శివలింగానికి విశేష పంచామృతాభిషేకం నిర్వహించి అలంకరించారు. రథంపై రామలింగేశ్వరస్వామి, విఘ్నేశ్వరుడు, శివలింగంను అలంకరించి ఊరేగించారు. మంత్రాలయం సీఐ రామాంజులు, ఎస్ఐ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు.
కోసిగి: మండల పరిధిలోని కార్తీక మాస పూజలు పురస్కరించుకుని శుక్రవారం రామలింగేశ్వరస్వామి రథో త్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు మంజునాథ్ దర్శనం చేసుకుని రథోత్సవంలో పాల్గొన్నారు. ఉదయం నుంచి రామలింగేశ్వర స్వామికి భక్తులు పూజలు చేశారు. గ్రామ పెద్దలు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
పెద్దకడబూరు: బసలదొడ్డి గ్రామంలో వెలసిన పైరాయ ఆంజనేయస్వామి దేవాలయంలో శుక్రవారం భక్తులు పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కు లను తీర్చుకున్నారు. సాయంత్రం సంధ్యావేళలో స్వామివారి రథోత్స వాన్ని కనులపండువగా నిర్వహించారు. ఏఎస్ఐ ఆనంద్, శివరాము, పోలీసు సిబ్బంది ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.
కౌతాళం: కౌతాళంలో శుక్రవారం కార్తీక మాసం సందర్భంగ కార్తీక పూజలను గ్రామంలోని తలారిగేరిలోని అంజనే యస్వామి దేవాలయం, ఎన్టీఆర్ నగర్‌లోని అంజనేయస్వామి దేవాలయంలో ఆయా కాలనీవాసులు, గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. మాజీ సర్పంచ్ కేదరేశ్వరి సందర్శించి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. వీరి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికి పూలమాల శాలువాలతో సన్మానించారు. ఆలయాల్లో అన్నదానం ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకులు ఉలిగయ్య, వెంకటపతిరాజు, మంజునాథ, రాజబాబు, రహిమాన్, సిద్దు, కురువ వీరేశ, రాజానందు ఉన్నారు.