Share News

రాఘవేంద్రుడి సన్నిధిలో కన్నడ సినీ హాస్యనటుడు

ABN , Publish Date - Nov 16 , 2025 | 12:14 AM

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం కన్నడ సినీ హాస్య నటుడు, బుల్లితెర నటుడు, యాంకర్‌ శషికచి చంద్ర శనివారం మంత్రాలయానికి వచ్చారు.

 రాఘవేంద్రుడి సన్నిధిలో కన్నడ సినీ హాస్యనటుడు
శ్రీమఠంలో ప్రదక్షిణ చేస్తున్న కన్నడ సినీ హాస్య నటుడు

మంత్రాలయం, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం కన్నడ సినీ హాస్య నటుడు, బుల్లితెర నటుడు, యాంకర్‌ శషికచి చంద్ర శనివారం మంత్రాలయానికి వచ్చారు. ఆయనకు మఠం మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాస రావు, సురేష్‌కోణాపూర్‌ ఘనంగా స్వాగతం పలికారు. గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని రాఘవేంద్ర స్వామి మూల బృందావనంకు విశేష పూజలు చేశారు. మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు శేషవస్త్రం, ఫల, పుష్ప, మంత్రాక్షితలు, పరిమళ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు. ఈయన వెంట అనంత పురాణిక్‌, వ్యాసరాజ్‌ ఆచార్‌, జేపి స్వామి, జయతీర్థ ఆచార్‌, ద్వారపాలక అనంతస్వామి, ప్రకాష్‌ ఆచార్‌ ఉన్నారు.

Updated Date - Nov 16 , 2025 | 12:14 AM