Share News

Crime News: చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసులో హైడ్రామా

ABN , Publish Date - Apr 29 , 2025 | 07:57 AM

ఎమ్మార్పీఎస్‌ రాయలసీమ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ పార్టీ కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి లక్ష్మీనారాయణను టిప్పర్‌‌తో ఢీ కొట్టి, కొడవళ్లతో నరికి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనలో ఆయన కుమారుడు, బంధువుకు గాయాలయ్యాయి.

Crime News: చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసులో హైడ్రామా
Crime News

కర్నూలు: ఎమ్మార్పీఎస్‌ (MRPS) రాయలసీమ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ పార్టీ (Congress Party) కర్నూలు జిల్లా (Kurnoo Dist) ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి (Aluru Constituency In-charge) చిప్పగిరి లక్ష్మీనారాయణ (Chippagiri Lakshminarayana) హత్య కేసు (murder case)లో హైడ్రామా (High Drama) చోటు చేసుకుంది. అర్ధరాత్రి లక్ష్మీనారాయణ హత్య ప్రదేశంలో ఆర్డీవోల సమక్షంలో అనంతపురం, కర్నూలు జిల్లా సరిహద్దుల వద్ద కొలత వేసి.. కర్నూలు జిల్లా పరిధిగా నిర్ధారించారు. దీంతో ఈ కేసును గుంతకల్లు పోలీస్ స్టేషన్ నుంచి చిప్పగిరికి మార్చారు.

Also Read: రెండు రోజులకో హత్య..


హత్య ఎలా జరిగిందంటే..

చిప్పగిరి లక్ష్మీనారాయణ (60) ఆదివారం దారుణ హత్యకు గురయ్యారు. అనంతపురం జిల్లా గుంతకల్లు శివారులో దుండగులు టిప్పర్‌తో ఢీకొట్టి, వేట కొడవళ్లతో నరికి చంపారు. కర్నూలు జిల్లా చిప్పగిరికి చెందిన ఆయన.. ఆదివారం ఉదయం తన కుమారుడు వినోద్‌కుమార్‌, సమీప బంధువు గోవిందుతో కలిసి గుంతకల్లుకు వచ్చారు. అనంతరం వారు మధ్యాహ్నం ఇన్నోవా వాహనంలో చిప్పగిరికి బయల్దేరారు. గుంతకల్లు-ఆలూరు రహదారిలో పట్టణ శివారులోని రైలు వంతెన సమీపాన స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద ఇన్నోవాను ఆగంతకులు టిప్పర్‌తో ఎదురుగా వచ్చి ఢీకొట్టారు. ఆ వెంటనే లక్ష్మీనారాయణను బయటకు లాగి, వేటకొడవళ్లతో ఆయన తల, వీపు మీద నరికారు. తర్వాత కారులో పరారయ్యారు.


లక్ష్మీనారాయణ వాహనం ముందుభాగం నుజ్జునుజ్జయింది. స్థానికులు వెంటనే ఆయనను, వినోద్‌కుమార్‌, గోవిందును గుంతకల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి లక్ష్మీనారాయణ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. గాయపడిన వినోద్‌కుమార్‌, గోవిందు మాట్లాడుతూ.. తమ వాహనాన్ని టిప్పర్‌తో ఢీకొట్టి దాదాపు 8 మంది కొడవళ్లతో లక్ష్మీనారాయణను విచక్షణరహితంగా నరికారని తెలిపారు. సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐలు మనోహర్‌, మస్తాన్‌ హత్యా స్థలాన్ని పరిశీలించారు. లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గుంతకల్లు వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా.. లక్ష్మీనారాయణకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఆయన 2006లో టీడీపీ నాయకుడు, కర్నూలు జిల్లా సహకార బ్యాంకు మాజీ చైర్మన్‌ వైకుంఠం శ్రీరాములు, ఆయన భార్య శకుంతల హత్య కేసులో నిందితుడి(ఏ-7)గా ఉన్నారు. ఈ కేసును న్యాయస్థానం కొట్టివేసింది.


చిప్పగిరిలో భారీ బందోబస్తు

లక్ష్మీనారాయణ దారుణ హత్య నేపథ్యంలో చిప్పగిరిలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య, ఆలూరు సీఐ రవిశంకర్‌రెడ్డి చిప్పగిరికి వెళ్లి బందోబస్తును పర్యవేక్షించారు. ఎస్‌ఐ సతీశ్‌ ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీ, హతుడు ఇంటి వద్ద, బస్టాండ్‌ ప్రాంతంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. లక్ష్మీనారాయణ మృతిపై మాజీ మంత్రి మూలింటి మారెప్ప. ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి, మాజీ ఎమ్మెల్యే మసాలా పద్మజ, ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి వీరభద్ర గౌడ్‌, ఎంఆర్‌పీస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్‌, తాలూకా అధ్యక్షుడు కత్తి రామాంజినేయులు, డివిజన్‌ అధ్యక్షులు ఎల్లప్ప, మసాలా జగన్‌ తమ ప్రగాడ సానుభూతి తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

మృతదేహాలను చూపి రాష్ట్ర హోదా డిమాండ్‌ చేయను

హైదరాబాద్‌-విజయవాడ హైవే 6 లేన్లుగా విస్తరణకు 5 వేల కోట్లు

For More AP News and Telugu News

Updated Date - Apr 29 , 2025 | 08:00 AM