నాలుగో రోజు హోమాలు
ABN , Publish Date - Nov 03 , 2025 | 11:58 PM
పట్టణంలోని వీవర్స్ కాలనీ మైదానంలో 87వ విశ్వశాంతి మహాయాగంలో భాగంగా హోమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.
ఎమ్మిగనూరు, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని వీవర్స్ కాలనీ మైదానంలో 87వ విశ్వశాంతి మహాయాగంలో భాగంగా హోమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. సోమవారం నాలుగోరోజు రుద్రపాశుపత సహిత మృత్యుంజయ హోమాలు నిర్వాహకులు కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. హోమాల్లో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి దంపతులు పాల్గొన్నారు. యాగశాల్లో ఏర్పాటు చేసిన హోమ గుండాల దగ్గర పలువురు భక్తులు హోమాల్లో పాల్గొన్నారు. భక్తులు పెద్దఎత్తున తరలిరావటంతో వీవర్స్ కాలనీ మైదానం భక్తులతో కళకళలాడింది. సాయంత్రం సహస్ర జ్యోతిర్లింగార్చన, రుద్రక్రమార్చన నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భజన మండలి సభ్యులు ఆలపించిన భక్తి పాటలు భక్తులను ఎంతగానో అలరించాయి.
=