Share News

న్యాయవాదుల హక్కుల కోసం పోరాటం

ABN , Publish Date - Nov 16 , 2025 | 12:11 AM

న్యాయవాదుల హక్కులకోసం దేశవ్యాప్తంగా ఐలు(ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌) పోరాటం చేస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు కె. కుమార్‌, జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్‌ తెలిపారు.

న్యాయవాదుల హక్కుల కోసం పోరాటం
నూతన కార్యవర్గ సభ్యులను సన్మానిస్తున్న నాయకులు

ఎమ్మిగనూరు, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): న్యాయవాదుల హక్కులకోసం దేశవ్యాప్తంగా ఐలు(ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌) పోరాటం చేస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు కె. కుమార్‌, జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్‌ తెలిపారు. శనివారం పట్టణంలోని ఎన్‌జీవోస్‌ కార్యాలయంలో న్యాయవాదుల సమావేశం నిర్వహించారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ ద్యక్షుడిగా చార్లెస్‌, అధ్యక్షులుగా రషీదుల్లా, ప్రధాన కార్యదర్శిగా అడ్డాకుల తిమ్మప్ప, ఉపాఽధ్యక్షులుగా అనిల్‌, రామ్మూర్తి, మల్లికార్జున, అజారుద్దీన్‌, సహాయ కార్యదర్శులుగా జయచంద్ర, ఇర్షాద్‌, మధు, నబీ రసూల్‌, కోశాధికారిగా దస్తగిరి, కమిటీ సభ్యులుగా అష్రఫ్‌తో పాటు మరో ఐదుగురిని ఎన్నుకున్నారు.

Updated Date - Nov 16 , 2025 | 12:12 AM