Share News

PSR Prisoner Number: జైలులో పీఎస్‌ఆర్ ప్రత్యేక అభ్యర్థన.. ఏంటంటే

ABN , Publish Date - Apr 24 , 2025 | 10:29 AM

PSR Prisoner Number: నటి జెత్వానీ కేసులో పీఎస్‌ఆర్ అరెస్ట్ అయి జైలులో ఉన్న విషయం తెలిసిందే. విజయవాడ జిల్లా జైలులో పీఎస్‌ఆర్ ఆంజనేయులుకు ఖైదీ నెంబర్ 7814ను కేటాయించారు.

PSR Prisoner Number: జైలులో పీఎస్‌ఆర్ ప్రత్యేక అభ్యర్థన.. ఏంటంటే
PSR Prisoner Number

అమరావతి, ఏప్రిల్ 24: ముంబై నటి జెత్వానీ వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ఇంటెలిజెన్స్ మాజీ బాస్ పీఎస్‌ఆర్ ఆంజనేయులుకు (Former Intelligence Chief PSR Anjaneyulu) విజయవాడ జిల్లా జైలులో ఖైదీ నెంబర్ 7814 కేటాయించారు. అయితే సంధ్యావందనం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని పూజా సామానులు తీసుకెళ్లేందుకు కూడా అనుమతి ఇవ్వాలని పీఎస్‌ఆర్‌ కోరారు. ఈ విషయాన్ని విజయవాడ జైలు అధికారులు జైళ్ల శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. జెత్వానీ కేసుకు సంబంధించి నిన్న పీఎస్‌ఆర్‌ను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.


ఈ క్రమంలో సంధ్యావందనం కోసం పూజా సామాగ్రి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. జైలు అధికారులు నిరాకరించారు. నిన్న మధ్యాహ్నం జైలు సందర్శించేందుకు వచ్చిన జైల్స్ డీఐజీకి పీఎస్‌ఆర్ అభ్యర్థనను తీసుకెళ్లారు జైలు అధికారులు. తాను ఉన్నతాధికారు దృష్టికి తీసుకెళ్లి తదనంతరం సమాచారం జైల్స్ డీఐజీ చెప్పారు. దీంతో ఈరోజు మధ్యాహ్నానికి పీఎస్‌ఆర్ అభ్యర్థనను అనుమతిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది .

Honeymoon Couple: హనీమూన్‌కు వెళ్లిన జంట.. కాల్పులకు ముందు ఏం చేశారంటే..


మరోవైపు ఏపీ లిక్కర్ స్కామ్‌లో ప్రధాన నిందితుడు రాజ్‌ కసిరెడ్డికి (Raj Kasireddy) ఖైదీ 7813 కేటాయించారు. అలాగే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలన్న సిట్‌ అధికారుల పిటిషన్‌పై కాసేపట్లో విజయవాడలోని ఏసీబీ కోర్టులో విచారణ జరుగనుంది. ఈ కేసులో మరింత విచారణ చేయాల్సి ఉందని కసిరెడ్డిని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని, విచారణకు పీఎస్‌ఆర్ సహకరించలేదని, ఆయన నుంచి మరిన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉందని పిటిషన్ వేశారు సిట్ అధికారులు. కమిషన్లు ఎవరెవరికి ముట్టాయో తెలియాల్సి ఉందన్నారు. అందు వల్ల పీఎస్‌ఆర్‌ను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ బృందం నిన్న విజయవాడ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. దీనిపై ఈరోజు విచారణ జరుగనుంది.


ఇవి కూడా చదవండి

Honeymoon Couple: హనీమూన్‌కు వెళ్లిన జంట.. కాల్పులకు ముందు ఏం చేశారంటే..

Gold Price Falls: లక్ష దిగువకు బంగారం

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 24 , 2025 | 01:01 PM