Amravati Capital Reconstruction: ఏపీకి ప్రధాని రాక.. మంత్రులు ఏమన్నారంటే
ABN , Publish Date - Apr 28 , 2025 | 04:04 PM
Amravati Capital Reconstruction: మే 2న జరిగే అమరావతి నిర్మాణ పునఃప్రారంభ పనులకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారని మంత్రులు తెలిపారు. జగన్ మూడు రాజధానుల పేరుతో అమరావతిపై కుట్రలు చేశారని మండిపడ్డారు.

కృష్ణా, ఏప్రిల్ 28: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) అమరావతి రాజధాని పునర్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న నేపథ్యంలో మచిలీపట్నంలో మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియా సమావేశం నిర్వహించారు. మచిలీపట్నం కలెక్టరేట్‌లో ప్రధాని పర్యటన ఏర్పాట్లపై మంత్రులు వంగలపూడి అనిత (Vangalapudi Anita), కొల్లు రవీంద్ర (Kollu Ravindra), బిసి జనార్ధన రెడ్డి (BC Janardhan Reddy), వాసంశెట్టి సుభాష్ (Vasamsetti Subhasg), జిల్లా ఎమ్మెల్యేల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, బీసీ జనార్ధన రెడ్డి మాట్లాడుతూ.. మే 2న జరిగే అమరావతి నిర్మాణ పునఃప్రారంభ పనులకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. జగన్ మూడు రాజధానుల పేరుతో అమరావతిపై కుట్రలు చేశారని మండిపడ్డారు.
ప్రజల ఆకాంక్షల మేరకు మళ్లీ అమరావతి పనులను వేగవంతం చేస్తున్నామన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలి రానున్నారని తెలిపారు. కృష్ణా జిల్లా నుంచి లక్ష మంది జనం వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. సభకు విచ్చేసిన ప్రజలకు అన్ని రకాల సదుపాయలు కల్పించేలా అధికారులను సన్నద్ధం చేస్తున్నామన్నారు. అమరావతి రాజధాని నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గతంలో విశాఖ కేంద్రంగా ప్రధాని లక్షల కోట్ల పెట్టుబడులకు శ్రీకారం చుట్టారన్నారు. ఇప్పుడు ప్రజల రాజధాని మన రాజధాని అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నారని తెలిపారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు స్పష్టం చేశారు.
Tirupati Road Accident: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం
ఇది శుభపరిణామం: అనిత
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. మహిళలు ముందుకు వచ్చి రాజధాని కోసం పోరాటం చేశారన్నారు. జగన్ వారిని పోలీసులతో దారుణంగా దాడులు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి రావడం శుభపరిణామమని చెప్పుకొచ్చారు. రాజధాని లేని రాష్ట్రంగా మన రాష్ట్రం ఉందన్నారు. జగన్ మూడు రాజధానుల పేరుతో అమరావతిని నాశనం చేశారని విమర్శించారు. అమరావతి పునర్ నిర్మాణం కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి
Guntur Mayor Election: గుంటూరు మేయర్ ఎన్నిక.. వైసీపీ అభ్యర్థి నామినేషన్
Visakhapatnam Mayor: విశాఖ మేయర్ ఎన్నిక ఏకగ్రీవం
Read latest AP News And Telugu News