Port Works: మచిలీపట్నం పోర్టు పనులను పరిశీలించిన మంత్రులు
ABN , Publish Date - Apr 28 , 2025 | 01:02 PM
మచిలీపట్నం పోర్టు పనులు త్వరగా పూర్తి చేయడం ద్వారా పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీలు కూడా ఎక్కువగా మచిలీపట్నంలో ఏర్పడేందుకు అవకాశాలు ఉంటాయని మంత్రులు కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. మరోవైపు బందరులో టూరిజం హబ్ ఏర్పాటు పనులు చేస్తున్నామని, సర్క్యూట్ టూరిజం అభివృద్ధి చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రులు తెలిపారు.

కృష్ణా జిల్లా: మచిలీపట్నం (Machilipatnam)లో పోర్టు పనులను (Port Works) మంత్రులు (Ministers) కొల్లు రవీంద్ర (Kollu Ravindra), బీసీ జనార్దన్ రెడ్డి (BC Janardhan Reddy) పరిశీలించారు. ఈ సందర్భంగా పోర్టు నిర్మాణ స్థితిని మంత్రులకు కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు వివరించారు. ఈ క్రమంలో సోమవారం మంత్రులు కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు నాలుగు బెర్తుల పనులు, రోడ్డు పనులు, విజయవాడకు అనుసంధానించే పనులు 40 శాతం పూర్తయ్యాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పోర్టు పనులపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారని, గేట్ వే ఆఫ్ అమరావతిగా బందరు పోర్టు మారేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఇన్లాండ్ వాటర్ వేస్ అభివృద్ధి చేయడం ద్వారా అమరావతి నిర్మాణంలో కూడా పోర్టు భాగస్వామిగా మారబోతోందన్నారు. పోర్టు పనులు త్వరగా పూర్తి చేయడం ద్వారా పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీలు కూడా ఎక్కువగా మచిలీపట్నంలో ఏర్పడేందుకు అవకాశాలు ఉంటాయన్నారు. మరోవైపు బందరులో టూరిజం హబ్ ఏర్పాటు పనులు చేస్తున్నామని, సర్క్యూట్ టూరిజం అభివృద్ధి చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రులు కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు.
Also Read: Guntur: ఎంపీ మిధున్ రెడ్డి బెయిల్ విచారణ వాయిదా..
రోబోటిక్ సేవల వినియోగం
కాగా మానవ రహిత, ఆధునిక సాంకేతిక, అధునాతన సౌకర్యాలతో 10 వేల టన్నుల సామర్థ్యం గల ఆటోమేటిక్ ఇంటిగ్రేటెడ్ గిడ్డంగి రాష్ట్రంలో ఏర్పాటు కానుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా పూర్తిగా కృత్రిమ మేధతో ఈ రోబోటిక్ గ్రెయిన్ స్టోరేజ్ గిడ్డంగిని మచిలీపట్నం పోర్టు సమీపంలో నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అన్నపూర్ణ-ఏపీ పేరుతో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ దీనిని ప్రతిపాదించింది. దీన్ని అల్ర్టా మోడరన్ టెక్నాలజీతో డిజైన్ చేశారు. బందరు పోర్టును దృష్టిలో ఉంచుకుని, పోర్టును ఆనుకుని ఉన్న మునిసిపల్ స్థలంలో పైలట్ ప్రాజెక్ట్‌గా దీనిని నిర్మించనున్నారు. దేశంలోనే కృత్రిమ మేధతో మానవ రహిత సేవలు, అధునాతన సౌకర్యాలు, ఆధునిక సాంకేతికతతో నిర్మించే తొలి గిడ్డంగి ఇదే కానున్నది. సాధారణంగా 10వేల టన్నుల గిడ్డంగి నిర్మాణానికి రూ.15కోట్లు ఖర్చయితే.. ఈ గిడ్డంగి నిర్మాణానికి రూ. 25 కోట్లు వ్యయం కానున్నది. హమాలీలతో పని లేకుండా.. ఆహార ధాన్యాల నిల్వ నష్టాలు, తూకంలో తేడాలు, దొంగతనాలు వంటివి జరగకుండా పౌరసరఫరాలు, ఎఫ్‌సీఐ, నాఫెడ్ సంస్థల కోసం దీనిని నిర్మించనున్నారు. ప్రస్తు త గిడ్డంగులకు చెల్లిస్తున్న అద్దె కన్నా 25ు తక్కువ వ్యయంతో ఉత్పత్తులను ఇందులో నిల్వ చేసుకునే వెసులుబాటు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. సాంప్రదాయ గిడ్డంగుల్లో చదరపు మీటరు స్థలంలో 1.5 టన్నుల సరుకు నిల్వ చేస్తే.. ఈ గిడ్డంగిలో చదరపు మీటరులో 5 టన్నులు నిల్వ చేయవచ్చు. నిధులు మంజూరైతే త్వరలో నిర్మాణాన్ని చేపట్టనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నూతన మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర ఎన్నిక
హరిరామ్ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
For More AP News and Telugu News