Share News

Narayana on TDR Bonds: మూడు నెలల్లోనే స్పష్టత.. టీడీఆర్ బాండ్లపై మంత్రి నారాయణ

ABN , Publish Date - Mar 07 , 2025 | 11:49 AM

Narayana on TDR Bonds: వచ్చే మూడు నెల‌ల్లోగా టీడీఆర్ బాండ్ల అక్రమాల‌పై పూర్తి స్పష్టత ఇస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. టీడీఆర్ బాండ్ అక్రమాలపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.

Narayana on TDR Bonds: మూడు నెలల్లోనే స్పష్టత.. టీడీఆర్ బాండ్లపై మంత్రి నారాయణ
Minister Narayana

అమ‌రావ‌తి, మార్చి 7: విశాఖలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విజిలెన్స్, సీఐడీ విచారణ జరుగుతోందని.. నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ (Minister Narayana) తెలిపారు. శుక్రవారం ఏపీ శాసనసభలో (AP Assembly Session) ప్రశ్నోత్తరాల సమయంలో టీడీఆర్ బాండ్లపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. గ‌త ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లలో భారీగా అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయని.. ఒక్క విశాఖ‌లోనే కాదు త‌ణుకు, తిరుప‌తిలో కూడా అక్రమాలు చేశారని చెప్పారు. త‌ణుకులో రూ.63.24 కోట్ల విలువ ఉన్న చోట రూ.754 కోట్లకు బాండ్లు జారీ చేశారని తెలిపారు.


రూర‌ల్ ఏరియాలో భూమి తీసుకుని పట్టణంలో ఉన్న ఇంటి వాల్యూతో బాండ్లు ఇచ్చారన్నారు. తిరుప‌తిలో రూ.170.99 కోట్లకు 29 బాండ్లు జారీ చేశారని అన్నారు. గ‌త ప్రభుత్వంలో అక్రమాలు జ‌ర‌గ‌డంతో తాము వ‌చ్చిన త‌ర్వాత ఐదు నెల‌లు బాండ్లు జారీ నిలిపివేశామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 965 టీడీఆర్‌లు, విశాఖ‌లో 266 టీడీఆర్‌లు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. మూడు నెల‌ల్లోగా టీడీఆర్ బాండ్ల అక్రమాల‌పై పూర్తి స్పష్టత ఇస్తామని మంత్రి పేర్కొన్నారు.

Teacher Beats Students: ప్రభుత్వ పాఠశాలలో దారుణం.. బయటపడ్డ పీఈటీ అరాచకం


రాజీవ్ స్వగృహ ప్రాజెక్టులపై సమాధానం...

అలాగే రాష్ట్రంలో రాజీవ్ స్వగృహ కింద చేపట్టిన ప్రాజెక్టులపై అసెంబ్లీలో మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. 2007లో ఎంఐజీ ఇళ్లు అభివృద్ధి చేసేలా రాజీవ్ స్వగృహ ప్రాజెక్ట్ తీసుకొచ్చామన్నారు. అనంతపురం, కర్నూలులో ప్రాజెక్ట్ పూర్తి అయిందని... మిగిలిన చోట్ల పెండింగ్‌లో ఉందన్నారు. మొత్తం 571.69 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ కొనసాగుతోందని తెలిపారు. ధరల విషయంలో మంత్రి వర్గ ఉపసంఘం పలు ప్రతిపాదనలు ఇచ్చిందన్నారు. అయితే పెండింగ్‌లో ఉన్న ఇళ్లను రద్దు చేయాలంటే న్యాయపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రాజెక్ట్ అమల్లో ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో చర్చించి ఎలా ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. వినియోగదారులకు షాక్

CBI: వివేకా వాచ్‌మన్‌ రంగయ్య మృతిపై కేసు నమోదు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 07 , 2025 | 11:49 AM