Share News

AP News: పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా మంత్రి లోకేష్ నివాళి..

ABN , Publish Date - Mar 16 , 2025 | 08:31 AM

ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు అమరజీవి. మహా పురుషుడు, భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయులు పొట్టి శ్రీరాములు. ఆయన జయంతి సందర్భంగా మంత్రి లోకేష్ ఘనంగా నివాళులర్పించారు.

AP News: పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా మంత్రి లోకేష్ నివాళి..
Minister Nara Lokesh

అమరావతి: ఆంధ్ర రాష్ట్ర (Andhra Pradesh) సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష (Hunger strike) చేపట్టి, ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు (Potti Sreeramulu) జయంతి (Birth Anniversary) సందర్భంగా ఆ మహనీయునికి ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Lokesh) ఘన నివాళి (Tribute) అర్పించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు జీవితం అందరికీ ఆదర్శమని అన్నారు. ఆయన కృషితేనే తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని, పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు. మహాత్మాగాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణకు జీవితాంతం కృషిచేశారని, అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయ సాధన కోసం అందరం పునరంకితమవుదామని మంత్రి లోకేష్ అన్నారు.

Also Read..:

వారికి జీతాలు ఎలా ఇస్తారు: టీడీపీ


ఈ వార్తలు కూడా చదవండి..

రూ. 800 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంఖుస్థాపన..

విజయసాయి నోరు విప్పితే.. జగన్ పరిస్థితి ఇదేనా..

For More AP News and Telugu News

Updated Date - Mar 16 , 2025 | 08:31 AM