Pawan Kalyan: మార్క్ శంకర్‌కు అత్యవసర వార్డులో చికిత్స...
ABN , Publish Date - Apr 09 , 2025 | 12:47 PM
సింగపూర్ ఆస్పత్రిలో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు. ఆస్పత్రి వద్దే పవన్ కళ్యాణ్, చిరంజీవి ఉన్నారు. ఊపిరి తిత్తుల్లోకి పొగ వెళ్లడంతో శ్వాసకు ఇబ్బంది కావడంతో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది. ప్రాణాపాయం లేదని వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం.

అమరావతి: సింగపూర్ (Singapore)లో మంగళవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదం (Fire Accident)లో ఏపీ డిప్యూటీ సీఎం (AP Deputy CM) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్ (Mark Shankar) గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ మంగళవారం రాత్రి సింగపూర్ వెళ్లారు. నేరుగా శంకర్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి చేరుకున్నారు. కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై అక్కడి వైద్యులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. తన కుమారుడికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోందని, చేతులు, కాళ్ళకు గాయాలు కావడంతోపాటు ఊపిరితిత్తులకు పొగ చూరడంతో అత్యవసర వార్డులో ఉంచి చికిత్స అందించారని తెలిపారు. ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై డాక్టర్లు పరీక్షలు చేశారని తెలియచేశారు. భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయం శంకర్‌ను అత్యవసర వార్డు నుంచి గదికి తీసుకువచ్చినట్లు పవన్ తెలిపారు. మరో మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలియచేశారన్నారు.
Also Read..: చంద్రబాబు కొత్త ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన
కాగా సింగపూర్ ఆస్పత్రిలో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు. ఆస్పత్రి వద్దే పవన్ కళ్యాణ్, చిరంజీవి ఉన్నారు. ఊపిరి తిత్తుల్లోకి పొగ వెళ్లడంతో శ్వాసకు ఇబ్బంది కావడంతో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది. ప్రాణాపాయం లేదని వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం. కాగా గాయపడిన పవన్ కుమారుడిని చూసేందుకు మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి సింగపూర్ వెళ్లారు. ఆస్పత్రి వద్దే ఉన్నారు.
సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాదం
సింగపూర్‌లో మంగళవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు. మంటల కారణంగా చేతులు, కాళ్లపై బొబ్బలు ఏర్పడ్డాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ చేరుకోవడంతో శ్వాస సంబంధిత సమస్యను ఎదుర్కొన్నాడు. ఏడేళ్ల మార్క్ శంకర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు జనసేన పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, ఈ ఘటనలో పదేళ్ల విద్యార్థిని మృతి చెందగా.. మరో 20 మంది వరకు గాయపడ్డారు. వీరిలో 15 మంది వరకు చిన్నారులు ఉన్నారు. అగ్నిప్రమాదం జరిగిందని తెలిసినప్పుడు అరకు పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మంగళవారం రాత్రి 9:30 గంటలకు సింగపూర్ బయల్దేరి వెళ్లారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గుంటూరు అవతలవారిని నరికేస్తాం.. ఇవతలవారిని లాక్కొచ్చి కొడతాం
చంద్రబాబు కొత్త ఇంటి నిర్మాణానికి భూమి పూజ..
For More AP News and Telugu News