Maredumilli Encounter: మావోలకు దెబ్బ మీద దెబ్బ... నిన్న హిడ్మా.. నేడు మరికొందరు
ABN , Publish Date - Nov 19 , 2025 | 11:25 AM
మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిన్నటి ఎన్‌కౌంటర్‌లో మావో అగ్రనేత హిడ్మా మరణించగా.. ఈరోజు మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది.
అమరావతి, నవంబర్ 19: మారేడిమిల్లిలో నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మాతో పాటు ఐదుగురు చనిపోయిన విషయం తెలిసిందే. ఈరోజు కూడా ఏవోబీలో కాల్పులు కొనసాగాయి. మారేడిమిల్లిలో ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టు కీలక నేతలు హతమయ్యారు. సౌత్ జోనల్ కమిటీ సభ్యుడు, ఆంధ్రా ఒరిస్సా బోర్డర్ ఇన్చార్జి జోగారావు అలియాస్ టెక్ శంకర్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. అలాగే పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు నంబాల కేశవరావు ప్రోటెక్షన్ టీం కమాండర్, డివిజనల్ కమిటీ సభ్యురాలు జ్యోతి కూడా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు.
మావోయిస్టు పార్టీ కమ్యూనికేషన్ టీం ఛీఫ్, సౌత్ జోనల్ కమిటీ మొంబర్ సురేష్ అలియాస్ రమేష్, ఏరియా కమిటీ సభ్యులు జాగరగొండ ఏరియా మిలిషియా కమాండర్ లోకేష్ అలియాస్ గణేష్ కూడా హతమయ్యారు. వీరితో పాటు జాగరగొండ డిప్యూటీ కమాండర్, ఏరియా కమిటీ సభ్యుడు శ్రీను అలియాస్ వాసు.. జాగరగొండ డివిజినల్ కమిటీ, ఏరియా కమిటీ సభ్యురాలు అనిత, ఇదే కమిటీలో సభ్యురాలు షమ్మి ఎన్‌కౌంటర్‌లో మరణించారు.
మొత్తం ఏడుగురు మావోయిస్టులు మరణించినట్టు అధికారులు ధృవీకరించారు. వీరి తలలపై లక్షల రివార్డు ఉందని స్పెషల్ ఇంటలిజెన్స్ బ్యూరో చెబుతోంది. నిన్న మారేడిమిల్లిలో జరిగిన హిడ్మా ఎన్ కౌంటర్‌లో తప్పించుకున్న ఆరుగురు కూడా హతమయ్యారని అధికారులు వెల్లడించారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్ జీ ఈరోజు ఎన్‌కౌంటర్‌లో మరణించాడని వస్తున్న సమాచారాన్ని పోలీసులు ఖండించారు.
ఇవి కూడా చదవండి...
చరిత్రలో ఇదే ప్రథమం.. మావోల అరెస్ట్‌పై ఏడీజీ
Read Latest AP News And Telugu News