Deputy CM Pawan: కూర్మ గ్రామంలో అగ్నిప్రమాదం దురదృష్టకరం: పవన్
ABN , Publish Date - Jun 14 , 2025 | 03:39 PM
Deputy CM Pawan: కూర్మగ్రామంలో అగ్నిప్రమాద ఘటనపై లోతైన విచారణ జరపాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. ఈ ఘటన దురుదృష్టకరమన్నారు.

అమరావతి, జూన్ 14: శ్రీకాకుళం జిల్లా కూర్మ గ్రామంలో అగ్నిప్రమాద ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) స్పందించారు. ఆధునిక హంగులు లేకుండా ఆధ్యాత్మిక చింతనతో జీవించేలా తీర్చిదిద్దుకున్న కూర్మ గ్రామం అగ్నికి ఆహుతి కావడం దురదృష్టకరమన్నారు. అగ్నిప్రమాదంపై పోలీసులు లోతుగా విచారణ చేయాలని సంబంధిత యంత్రాంగానికి సూచనలు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఆ కోణంలోనూ దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. కూర్మ గ్రామంలో ప్రస్తుత పరిస్థితిపై జిల్లా అధికారులతో మాట్లాడి, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
సనాతన ధార్మిక జీవనం కోసం ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ గ్రామం ఏర్పాటైందని తెలిపారు. కూర్మ గ్రామవాసులు యాంత్రిక జీవన విధానాలకు భిన్నంగా మట్టి ఇళ్లల్లో ఉంటూ ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారన్నారు. వేద విద్యను అభ్యసించే చిన్నారులు సంస్కృతం, తెలుగు, హిందీ, ఆంగ్లం అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారని అన్నారు. వర్తమాన కాలంలో విశిష్టంగా ఉన్న ఈ గ్రామం పునరుద్ధరణపై దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఇటీవల కూర్మ గ్రామంలోని ఆధ్మాత్మిక ప్రసంగాలు చేసే రాధాకృష్ణ మందిరంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో విలువైన గ్రంథాలు, పుస్తకాలు అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు రూ.50 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం రంగంలోకి దిగి పలు ఆధారాలను సేకరించాయి. గతంలోనూ దుండుగులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని నిర్వాహకులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
పొదిలి దాడి కేసులో మరో 15 మంది అరెస్ట్
ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం.. ఇండియన్స్‌కు ఇజ్రాయెల్ క్షమాపణలు..
Read Latest AP News And Telugu News