Share News

Naga Babu MLC nomination: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్.. బలపరిచిన లోకేష్

ABN , Publish Date - Mar 07 , 2025 | 02:20 PM

Nagababu: జనసేన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదల నాగబాబు నామినేషన్ వేశారు. రిటర్నింగ్ అధికారి వనితారాణికి నామినేషన్ పత్రాలు అందజేశారు నాగబాబు.

Naga Babu MLC nomination: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్.. బలపరిచిన లోకేష్
Konidela Nagababu

అమరావతి, మార్చి7: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదల నాగబాబు (Konidela Nagababu) నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు (శుక్రవారం) ఏపీ అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వనితారాణికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) బలపరిచారు. నాగబాబు నామినేషన్ దాఖలు కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు, అలాగే నామినేషన్‌ను బలపరిచిన లోకేష్‌, మనోహర్‌కు నాగబాబు ధన్యవాదాలు తెలిపారు.


కాగా.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఐదు స్థానాల్లో ఒక అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారైన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా నాగబాబు పేరును పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ ఖరారు చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబును ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయాలని సమాచారం అందించారు. ఇందులో భాగంగా నిన్న నాగబాబుతో నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయించుకున్నారు.

Narayana on TDR Bonds: మూడు నెలల్లోనే స్పష్టత.. టీడీఆర్ బాండ్లపై మంత్రి నారాయణ


అయితే ముందుగా నాగబాబును రాజ్యసభకు పంపిస్తారంటూ వార్తలు వచ్చాయి. విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో నాగబాబును పంపించాలని అనుకునున్నప్పటికీ ఆ స్థానాన్ని ఖాళీ చేయించింది బీజేపీ కాబట్టి... ఆ స్థానాన్ని కమలం పార్టీకి వదలాలి అనే సూచనలు కూడా వచ్చాయి. అలాగే నాగబాబును కేబినెట్‌లో తీసుకోవాలని కూడా నిర్ణయించనప్పటికీ దీనిపై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ రావడంతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడిన అనంతరం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిల్లో జనసేన అభ్యర్థిగా నాగబాబు పేరును పవన్ కళ్యాణ్‌ ఖరారు చేశారు.


ఇవి కూడా చదవండి..

CBI: వివేకా వాచ్‌మన్‌ రంగయ్య మృతిపై కేసు నమోదు

Narayana on TDR Bonds: మూడు నెలల్లోనే స్పష్టత.. టీడీఆర్ బాండ్లపై మంత్రి నారాయణ

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 07 , 2025 | 02:37 PM