Share News

CM Chandrababu: సీఎం చంద్రబాబు భద్రతలో సడన్ చేంజెస్.. కారణమిదే

ABN , Publish Date - Jan 08 , 2025 | 09:36 AM

Andhrapradesh: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భద్రతా వలయంలోకి కౌంటర్ యాక్షన్ బృందాలు చేరాయి. ఎన్‌ఎస్‌జీ, ఎస్‌ఎస్‌జీ, స్థానిక సాయుధ బలగాలకు అదనంగా ఆరుగురు కమాండోలతో కౌంటర్ యాక్షన్ టీంను ఏర్పాటు చేశారు. ఎస్పీజీ ఆధ్వర్యంలో కౌంటర్ యాక్షన్ టీంకు శిక్షణ ఇస్తున్నారు.

CM Chandrababu: సీఎం చంద్రబాబు భద్రతలో సడన్ చేంజెస్.. కారణమిదే
CM Chandrababu Naidu

అమరావతి, జనవరి 8: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) భద్రతలో మార్పులు చేశారు. మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో ప్రత్యేక సెక్యూరిటీ గ్రూప్‌లో మార్పులు జరిగాయి. సీఎం భద్రతా వలయంలోకి కౌంటర్ యాక్షన్ బృందాలు చేరాయి. ఎన్‌ఎస్‌జీ, ఎస్‌ఎస్‌జీ, స్థానిక సాయుధ బలగాలకు అదనంగా ఆరుగురు కమాండోలతో కౌంటర్ యాక్షన్ టీంను ఏర్పాటు చేశారు. ఎస్పీజీ ఆధ్వర్యంలో కౌంటర్ యాక్షన్ టీంకు శిక్షణ ఇస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు భద్రతా వలయంలో కౌంటర్ యాక్షన్ టీంలు రంగ ప్రవేశం చేశారు. దేశంలో బ్లాక్ క్యాట్ కమాండోలు, ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ ఉన్న అతికొద్ది మంది వ్యక్తుల్లో చంద్రబాబు ఒకరు. తిరుపతిలోని అలిపిరి వద్ద ఆయనపై నక్సల్స్‌ దాడి చేసిన తర్వాత ఆయనకు ఎన్‌ఎస్‌జీ బ్లాక్ క్యాట్ కమాండోలు వచ్చారు. ఈ బ్లాక్ క్యాట్ కమాండోలతో పాటు చంద్రబాబుకు భద్రతా వలయం కూడా ఎప్పుడూ కూడా కట్టుదిట్టంగా ఉంటుంది.


చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు పలు మార్లు దాడులు జరిగిన సమయంలో కూడా ఎన్ఎస్‌జీ కమాండోల సంఖ్యను పెంచారు. ముందు ఆరుగురు కమాండోలు ఉండగా.. చంద్రబాబు బయటకు వెళ్లే సమయంలో ఆ సంఖ్యను 12కు చేశారు. వీరు నిత్యం కంటికిరెప్పలా చంద్రబాబును కాపాడుతూ ఉండేవారు. అయితే ఇప్పుడు నక్సల్స్‌ ప్రభావం పెరిగిన నేపథ్యంలో కౌంటర్ యాక్షన్ టీంను రంగంలోకి దింపారు. ఆయనకు భద్రతావలయంలో మొత్తం మూడు వలయాలుగా ఏర్పడి చంద్రబాబుకు రక్షణ కల్పిస్తారు. మొదటి మూడంకెల భద్రతా వలయంలో ఎన్‌ఎస్‌జీ (నేషనల్ సెక్యూరిటీ గ్రూప్), రెండవ వలయంలో ఎస్‌ఎస్‌జీ(స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్) ఉంటారు. చంద్రబాబు వివిధ ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన సమయంలో వీరందరికి దూరంలో ఆరుగురు కౌంటర్ యాక్షన్ కమాండోలు ఉంటారు.

వావ్.. ఇది సాధారణ గుర్రం కాదు.. అసాధారణ ట్యాలెంట్..


చంద్రబాబుపై దాడి చేయడానికి వచ్చిన వారిని, బాబుకు అపాయం తలపెట్టడానికి వచ్చిన వారిని ఎదుర్కోవడంలో కౌంటర్ యాక్షన్ టీంకు శిక్షణ ఇచ్చారు. మొదటి రెండు బృందాలు ఏదైనా దాడి జరిగితే చంద్రబాబును సురక్షిత ప్రాంతానికి తరలిస్తారు. మూడో బృందంగా ఉండే కౌంటర్ యాక్షన్ టీం మాత్రం.. దాడికి వచ్చిన వారిని తదముట్టించే వరకు వదిలే ప్రసక్తే ఉండదు. ఆ మేరకు కౌంటర్ యాక్షన్ టీంకు శిక్షణ ఇచ్చారు. స్పెషల్ సెక్యూటిరిటీ గ్రూప్‌కు చెందిన ఈ కమాండోలు విదేశాలకు, దేశంలో వివిధ అత్యుత్తమ శిక్షణ ఇచ్చే కేంద్రాలకు వెళ్లి వీరికి శిక్షణ ఇప్పించి.. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడుకు భద్రత కల్పించే టీంలో వీరిని రంగప్రవేశం చేయించారు. వారం నుంచి చంద్రబాబుకు ఈ కమాండోలు భద్రతగా ఉన్నప్పటికీ నిన్నటి నుంచి అధికారికంగా కౌంటర్ యాక్షన్ టీంను ముఖ్యమంత్రి భద్రతా వలయంలో చేర్చారు.


ఇవి కూడా చదవండి...

విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం

వావ్.. ఇది సాధారణ గుర్రం కాదు.. అసాధారణ ట్యాలెంట్..

Read Latest AP News And Telugu news

Updated Date - Jan 08 , 2025 | 10:48 AM