Maoists In Kakinada And Eluru: ఇటు ఏలూరు... అటు కాకినాడలో మావోల అరెస్ట్
ABN , Publish Date - Nov 18 , 2025 | 03:54 PM
ఏపీలోని పలు జిల్లాలో మావోయిస్టులు పట్టుబడుతుండటం కలకలం రేపుతోంది. ఇప్పటికే విజయవాడలో 27 మంది మావోలు అరెస్ట్ అవగా.. కాకినాడ, ఏలూరులోనూ మావోలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
కాకినాడ, నవంబర్ 18: ఏపీలో మావోయిస్టుల కలకలం రేగింది. అల్లూరి సీతారామారాజు జిల్లా మారేడుమిల్లి అడువుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో దొరికిన డైరీ ఆధారంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పోలీసుల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికే విజయవాడలోని కొత్త ఆటోనగర్‌లో దాదాపు 27 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ బిల్డింగ్‌లో ఉన్నట్లు పక్కా సమాచారంతో గ్రేహౌండ్స్, అక్టోపస్ బలగాలు, జిల్లా పోలీసులు అక్కడకు చేరుకుని మావోయిస్టులను అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతానికి తరలించారు.
ఇప్పుడు తాజాగా కాకినాడ జిల్లాలోనూ ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో దొరికిన డైరీ ఆధారంగా వీరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే వీరి వివరాలను మాత్రం పోలీసులు గుట్టుగా ఉంచుతున్నారు. మరికాసేపట్లో ఇద్దరు మావోయిస్టులను చూపించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అటు ఏలూరులోనూ మావోయిస్టుల కలకలం రేగింది. ఏలూరు గ్రీన్ సిటీలో తలదాచుకున్న మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. దాదాపు 15 మంది మావోలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. గ్రేహౌండ్ పోలీసులు అత్యంత రహస్యంగా ఆపరేషన్ కగార్‌ను నిర్వహించారు. గ్రీన్ సిటీలోని ఒక ఇంటిలో గత వారం రోజులుగా మావోలు తలదాచుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు.
ఇవి కూడా చదవండి...
విజయవాడలో మావోల కదలికలు.. పోలీసుల అలర్ట్
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ నిర్ణయం ఇదే
Read Latest AP News And Telugu News