Share News

Anitha: మేమే రివేంజ్ తీర్చకోవాలనుకుంటే...

ABN , Publish Date - Feb 15 , 2025 | 12:40 PM

Homeminister Anitha: వైసీపీ నేత వంశీ అరెస్ట్ విషయంలో జగన్ వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎంను తిడితే బీపీ పెరిగి దాడి చేశారని నాడు జగన్ చెప్పారని.. వంశీ అరెస్టుపై నీతి కబుర్లు చెప్పడం ఏంటని అనిత ప్రశ్నించారు.

Anitha: మేమే రివేంజ్ తీర్చకోవాలనుకుంటే...
Home Minister Vangalapudi Anitha

విజయవాడ, ఫిబ్రవరి 15: వైసీపీ నేత వల్లభనేని వంశీ (Vallabhaneni Vamshi) అరెస్ట్‌పై హోంమంత్రి అనిత (Home Minister Vangalapudi Anitha) స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వంశీ తప్పు చేసినట్లు అన్ని ఆధారాలు ఉన్నాయని.. ఆధారాలతో వంశీని అరెస్టు చేసి పోలీసులు జైలుకు పంపారని తెలిపారు. దళితుడిని భయపెట్టి బెదిరించి వంశీ కిడ్నాప్ చేయించారన్నారు. డీజీపీ ఆఫీసు పక్కనే ఉన్న టీడీపీ ఆఫీసుపై దాడి జరిగితే కనీసం రక్షణ కల్పించలేదని అన్నారు. సీఎంను తిడితే బీపీ పెరిగి దాడి చేశారని నాడు జగన్ చెప్పాడరని.. వంశీ అరెస్టుపై నీతి కబుర్లు చెప్పడం ఏంటని ప్రశ్నించారు.


సత్య వర్ధన్ బ్రదర్ వచ్చి వంశీని బెదిరించి బలవంతంగా అఫిడవిట్ దాఖలు చేశారని చెప్పారని.. పులివెందుల ఎమ్మెల్యే, మాజీ సీఎం జగన్ తెగ బాధ పడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లు జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారన్నారు. గత 5 ఏళ్లు టీడీపీపై అబద్ధపు కేసులు పెట్టారని, దాడులు చేశారని గుర్తు చేశారు. ‘‘మేము రివేంజ్ తీర్చుకోవాలని అనుకుంటే ఇన్ని నెలలు సమయం తీసుకోము’’ అని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.

జగన్.. ఇక నీ చాప్టర్ క్లోజ్


డిజిటల్ ఎవిడెన్స్‌పై...

హోంమంత్రి ఇంకా మాట్లాడుతూ.. డిజిటల్ ఎవిడెన్స్‌పై సమన్వయం చేసుకుని పని చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసు శాఖ, న్యాయ శాఖ మధ్య సమన్వయం ఉండాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. ఒక గౌరవమైన వృత్తిలో న్యాయ వ్యవస్థ ఉందని.. పోలీసులు, లాయర్లను చూసి ఇప్పుడు గర్వపడుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో సైబర్ నేరాలు మరింత ఎక్కువగా జరుగుతాయని తెలిపారు. ‘‘ప్రస్తుతం దొంగలు.. మన కన్నా షార్ప్‌ గా ఉన్నారు. డిజిటల్ ఎవిడెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సైబర్ నేరాలు బాగా పెరుగుతున్నాయి. లాయర్లు, డాక్టర్లు, పోలీసులు కూడా సైబర్ క్రైంలో చిక్కుకున్నారు. ఈజీ మని కోసం జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. డిజిటల్ క్రైం, డిజిటల్ ఎవిడెన్స్‌పై అవగాహన ఉండాలి’’ అని చెప్పుకొచ్చారు.


ఆ విషయంలో జాగ్రత్తలు ముఖ్యం..

నిందితులకు శిక్ష పడే విషయంలో కాలయాపన జరుగుతోందన్నారు. ఏదైనా ఒక నేరం జరిగి కేస్ వస్తే లీగల్ టీం పోలీసు డిపార్ట్మెంట్‌కు సపోర్ట్ చేస్తే ఎందుకు శిక్షలు ఆలస్యం అవుతాయని అన్నారు. ఎవిడెన్స్ కలెక్ట్ చేసే విషయంలో జాగ్రత్తలు ముఖ్యమని వెల్లడించారు. న్యాయవ్యవస్థకు గౌరవం ఇవ్వాలంటే పోలీసులకు కూడా న్యాయవాదులు అంతే గౌరవం ఇస్తే న్యాయం త్వరగా జరుగుతుందని అభిప్రాయపడ్డారు. విజయనగరం జిల్లాలో ఆరు నెలల చిన్నారిపై అత్యాచారం జరిగిందని.. మూడు నెలల్లోనే నిందితుడికి 25 సంవత్సరాల జైలు శిక్ష పడిందన్నారు. పోలీస్ న్యాయ వ్యవస్థ సక్రమంగా పని చేయడం వల్ల ఇది సాధ్యం అవుతుందని చెప్పారు.


ఆ ఇద్దరు కలిసి పనిచేస్తేనే...

ఇంట్లో టీవీ, ఫ్రిజ్ ఉన్నట్టే సీసీ టీవీ కూడా ఉండాలన్నారు. డ్రోన్ సహాయంతో ట్రాఫిక్ జామ్‌పై దృష్టి పెట్టామని..ట్రాఫిక్ కంట్రోల్‌కు డిజిటల్ టెక్నాలజీ వాడుతున్నామన్నారు. ఏదైనా కష్టం వస్తే పోలీసులు గుర్తొస్తున్నారని అంతవరకు సంతోషమన్నారు. పబ్లిక్‌కు అర్ధమయ్యే భాషలో ప్రాసిక్యూటర్లు కూడా మాట్లాడితే కేసు ఏంటి అనేది అర్ధం అవుతుందని తెలిపారు. న్యాయవాదులు, పోలీసులు కలిసి పని చేస్తే తప్పకుండా న్యాయం జరుగుతుందన్నారు. న్యాయవ్యవస్థకు పోలీసుల సహకారం తప్పకుండా ఉంటుందని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్.. అసలు కారణమిదే..

రైతన్నకు అండగా.. ప్రధాన మంత్రి ఫసల్ బీమా

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 15 , 2025 | 12:41 PM