Fake Liquor Scam: జోగి రమేశ్ రిమాండ్ పొడిగింపు.. అద్దేపల్లికి కూడా...
ABN , Publish Date - Nov 13 , 2025 | 06:21 PM
నకిలీ మద్యం తయారీ, సరఫరా కేసులో నిందితులైన జోగి రమేశ్, అద్దేపల్లి జనార్దన్ రావుల రిమాండ్‌ను ఈనెల 25 వరకు పొడిగించింది న్యాయస్థానం. వీరిపై ఉన్న పోలీస్ కస్టడీ పిటిషన్ల విచారణను ఈనెల 17కి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.
విజయవాడ, నవంబర్ 13: నకిలీ మద్యం తయారీ, సరఫరా విషయంలో నమోదైన కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ రిమాండ్‌ను ఈ నెల 25 వరకూ పొడిగించారు. ఆయనతో పాటు ఈ కేసులో మరో నిందితుడైన అద్దేపల్లి జనార్దన్ రావుకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని ఎక్సైజ్ కోర్టు తెలిపింది.
ఈ మేరకు గురువారం వర్చువల్‌గా న్యాయమూర్తి ఎదుట వీరిరువురినీ అధికారులు హాజరుపరిచారు. అయితే పోలీస్ కస్టడీ పిటిషన్ల విచారణను మాత్రం ఈనెల 17కి వాయిదా వేస్తున్నట్టు ఎక్సైజ్ న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లను కూడా ఈ నెల 20కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.
లిక్కర్ స్కామ్‌లో నిందితులు చెవిరెడ్డి, వెంకటేశ్ నాయుడుల బెయిల్ పిటిషన్ల మీద ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. అయితే.. ఈ కేసుపై ఈనెల 17న మరోసారి విచారణ చేపట్టనున్నట్టు న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
ఇవీ చదవండి:
వివేకా హత్య కేసులో లోతైన విచారణ జరగాలి: సునీత తరఫు న్యాయవాది
గుడ్ న్యూస్.. వారి కోసం నిధులు విడుదల చేసిన కూటమి సర్కార్..