Jagan Big Shock: జగన్‌కు భారీ ఎదురు దెబ్బ
ABN , Publish Date - Apr 18 , 2025 | 11:55 AM
Jagan Big Shock: వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వరుస షాక్‌లు ఇస్తోంది ఈడీ. ఇప్పుడు ఏకంగా 800 కోట్ల ఆస్తులను జప్తు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.

న్యూఢిల్లీ , ఏప్రిల్ 18: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (Former CM YS Jagan Mohan Reddy) ఈడీ (ED) బిగ్ షాక్ ఇచ్చింది. జగన్‌కు సంబంధించిన దాదాపు రూ.800 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 14 ఏళ్లుగా కొనసాగుతున్న మనీలాండరింగ్ కేసులో రూ. 800 కోట్ల విలువైన భూములు, షేర్లను ఈడీ జప్తు చేసింది. 2009 - 2010 కాలంలో నమోదైన అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులో ఈడీ చర్యలు తీసుకుంది.
జగన్ మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో, ఆయన కంపెనీలకు లాభాలు కలిగించారని దానికి బదులుగా వ్యాపార సంస్థల నుంచి లాభాలు పొందారని ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ఉన్న భూములు, కొన్ని కంపెనీలలో ఉన్న వాటాలు (షేర్లు) ఈడీ అటాచ్ చేసినట్టు సమాచారం. ఈ ఆస్తులు జగన్ రెడ్డి వ్యక్తిగతం కంటే ఎక్కువగా ఆయన కుటుంబం, సంబంధిత కంపెనీలు, సహచరుల పేరిట ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ కూడా విచారణ కొనసాగిస్తోంది.
Pawan Kalyan: గొప్ప మనసు చాటుకున్న పవన్ కల్యాణ్
అనేక అవినీతి కేసులో జగన్ ఏ1గా ఉన్నారు. ఆయనపై దాదాపు 14 కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులకు సంబంధించి గతంలో చర్లపల్లి జైలులో దాదాపు 16 నెలల పాటు శిక్ష అనుభవించింది. ఇప్పుడు తాజాగా ఆ కేసులకు సంబంధించి ఈడీ దూకుడు పెంచింది. జగన్‌కు సంబంధించి ప్రస్తుతం రూ.800 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. 2009- 2010- 2011 మూడు సంవత్సరాల్లో నమోదైన సీబీఐ కేసులను ఆధారంగా చేసుకుని దాదాపు 12 సంవత్సరాలుగా ఈడీ కూడా దర్యాప్తు కొనసాగిస్తోంది. జగన్ కంపెనీలు, బినామీలు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే అభియోగాలను సీబీఐ గతంలో మోపింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను ఆధారంగా చేసుకుని ఈడీ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేసి విచారణ కొనసాగించారు. 14 ఏళ్ల తర్వాత రూ.800 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది.
పునీత్ దాల్మియా కంపెనీకి చెందిన రూ.793 కోట్లు జప్తు చేసినట్లు ఈడీ అధికారులు అధికారికంగా ప్రకటించారు. గతంలో కడప జిల్లాలో అక్రమంగా సున్నపురాయి గనులను పునీత్ దాల్మీయా కంపెనీకి కట్టబెట్టడం, వారికి లాభాలు చేకూరడంతో ఆ కంపెనీ నుంచి డబ్బులు తీసుకున్నారనే విషయాన్ని సీబీఐతో పాటు ఈడీ కూడా విచారణలో వెల్లడించింది. భారతీ సిమెంట్స్ క్విడ్ ప్రోకోకు పాల్పడిందంటూ గతంలో సీబీఐ తన చార్జ్‌షీట్‌లో స్పష్టం చేసింది. ఈడీ అధికారులు కూడా అదే అంశాన్ని స్పష్టం చేశారు. బినామీల పేరుపై ఉన్న ఆస్తులు, క్విడ్ ప్రోకు పాల్పడ్డాక లబ్ది పొందిన కంపెనీలకు చెందిన ఆస్తులను కూడా ఈడీ జప్తు చేసింది. కడప జిల్లాలో ఉన్న సున్నపురాయి గనులను దాల్మియా సిమెంట్స్‌కు కట్టబెట్టడం, వారికి లబ్ది చేకూర్చే విధంగా అప్పటి ఎంపీ జగన్ వ్యవహరించారని ప్రస్తుతం ఈడీ అధికారులు విచారణలో వెల్లడించారు. 2011లో కేసు నమోదు చేసిన సీబీఐ 2013లో చార్జ్‌షీట్ ఫైల్ చేసింది. ఛార్జ్‌షీట్‌లో ఎన్నో ముఖ్యవిషయాలను ప్రస్తావించింది సీబీఐ. భారతీ సిమెంట్స్‌లో దాల్మియా సిమెంట్స్ పెట్టుబడి పెట్టుందని సీబీఐ విచారణలో వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
Cool Drink Incident: అసలేం తినేటట్టు లేదు.. తాగేట్టూ లేదుగా
BJP New Chief: 10 రోజుల్లో బీజేపీకి కొత్త సారథి
Read Latest AP News And Telugu News