Former CJI NV Ramana: ఫస్ట్ జాబ్‌పై ఎన్వీ రమణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ABN , Publish Date - Apr 12 , 2025 | 04:52 PM
Former CJI NV Ramana: మాజీ సీజేఐ ఎన్వీ రమణ.. తన మొదటి జాబ్ గురించి మీడియాతో పంచుకున్నారు. ఒక వృత్తిగాని, ఉద్యోగం గానీ చేసినప్పుడు సరైనటువంటి గౌరవం ఉండాలని తెలిపారు.

విజయవాడ, ఏప్రిల్ 12: ‘నా మొదటి ఉద్యోగం జర్నలిస్టుగానే ప్రారంభించాను’ అని అన్నారు మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ (Former Chief Justice of the Supreme Court Nutalapati Venkataramana). శనివారం మీడియాతో మాట్లాడుతూ.. డిగ్రీ పూర్తయిన తర్వాత ఏం చేయాలో తెలియని సమయంలో ఒక తెలుగు దినపత్రికలో సబ్ ఎడిటర్‌గా జాయిన్ అవుదామని వెళ్లానని తెలిపారు. తాను రాసిన ఒక నవలను వారికి చూపించానని.. సబ్ ఎడిటర్‌గా కాకుండా రిపోర్టర్‌గా వెళ్తావా అని అడిగితే వెళ్తానని చెప్పానని అన్నారు. కొన్నాళ్లపాటు విజయవాడ సిటీలో జర్నలిస్టుగా పనిచేసినట్లు చెప్పారు. అప్పట్లో ఇంత మంది జర్నలిస్టులు లేరన్నారు. విజయవాడలో మొత్తం 10 మంది జర్నలిస్టులు మాత్రమే ఉన్నారని చెప్పుకొచ్చారు.
వృత్తిపై గౌరవంతో
వినోదం, విజ్ఞానం, ఆనందం, హాస్యం అన్ని రకాలు జర్నలిస్టులు అందిస్తున్నారన్నారు. ఒక వృత్తిగాని, ఉద్యోగం గానీ చేసినప్పుడు సరైనటువంటి గౌరవం ఉండాలని తెలిపారు. వృత్తి పట్ల ఎలాంటి నిబద్ధతతో పనిచేస్తున్నామో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని సూచించారు. ఇస్తున్నటువంటి వార్తలు గాని అంశాలు గాని ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో తెలుసుకోవాలన్నారు. జర్నలిస్ట్ మాట్లాడే ప్రతీ మాట ఒకర్ని కించపరిచేలా ఉండకూడదన్నారు. మనం ఇచ్చేటటువంటి వార్త వాస్తవాలకి దగ్గరగా, నిష్పక్షపాతకంగా ఉండాలని వెల్లడించారు.
Inter Supplementary Exams: ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్.. ఫీజు చెల్లింపుకు తుది గడువు ఇదే
వాస్తవాలు చెప్పండి
ఇప్పుడున్న పత్రికలు వాస్తవాలను రాయడం లేదని... ఊహించుకొని రాస్తున్నారన్నారు. మనము ఏ సబ్జెక్టుకు సంబంధించి జర్నలిజం అయితే రిపోర్టింగ్ చేస్తున్నమో దాని మీద పూర్తిగా అవగాహన ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఒకరిని మనం ఇంటర్వ్యూ చేసే ముందు వారి గురించి పూర్తిగా తెలిసి ఉండాలన్నారు. అప్పట్లో పేపర్లో పెద్ద అక్షరాలతో వార్త వేస్తే ప్రజలు నమ్మేవారని.. ఇప్పుడు ప్రజలi వార్తలను నమ్మే పరిస్థితి లేదన్నారు. ఇప్పుడు చాలా రకాల జర్నలిస్టు సంఘాలు ఏర్పడ్డాయని.. ఇన్ని రకాల జర్నలిస్టు సంఘాలు అవసరం లేదని.. అందరూ ఒకే తాటిపైకి ఒకే మాట మీద ఉండాలని సూచనలు చేశారు.
అలా చేయొద్దు
జర్నలిస్టు ఉద్యోగం అంటే డాక్టర్ ఉద్యోగం లాంటిదని.. 24 గంటలు ఎక్కడ ఏ న్యూస్ వస్తుందో వాటి కోసం కష్టపడాల్సి వస్తుందన్నారు. 99 శాతం మంది జర్నలిస్టులు పేదవారే ఉన్నారని తెలిపారు. తక్కువ జర్నలిస్టులు మాత్రమే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారన్నారు. జర్నలిస్ట్ అనేవారు జ్ఞానాన్నిపెంచుకుంటే బాగుంటుందని చెప్పుకొచ్చారు. పోటీ ప్రపంచంలో జర్నలిస్ట్ ఇంకొక జర్నలిస్టుని కించపరచుకుంటున్నారని.. అది మంచి పద్ధతి కాదన్నారు. మన గౌరవం మనమే తీసుకున్నట్టు అవుతుందని తెలిపారు. వీటన్నిటిని తెలుసుకొని జర్నలిస్టులు ముందుకు పోవాలని మాజీ సీజేఐ కోర్టు ఎన్వీ రమణ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
AP Inter Results 2025: ఇంటర్ ఫలితాలు త్వరగా తెలుసుకోవాలంటే దీనిపై క్లిక్ చేయండి
Inter Results Top Districts: ఇంటర్ ఫలితాల్లో టాప్‌లో నిలిచిన జిల్లాలు ఇవే
Read Latest AP News And Telugu News