Share News

Devineni Slams Jagan: ఆ మూడు ఘటనలు జగన్ కుతంత్రాల్లో భాగమే: దేవినేని

ABN , Publish Date - Jul 14 , 2025 | 02:48 PM

Devineni Slams Jagan: వైసీపీ నేతలకు ప్రజల్లోకి వెళ్లే దమ్ము ధైర్యం లేక పార్టీ మీటింగ్‌లు, ప్రెస్‌మీట్‌లు పెట్టి పిచ్చికూతలు కూస్తున్నారని దేవినేని ఉమా మండిపడ్డారు. ఇటువంటి మాటలు మాట్లాడి జైల్లో పెడితే సానుభూతి పొందవచ్చు అనుకుంటున్నారన్నారు.

Devineni Slams Jagan: ఆ మూడు ఘటనలు జగన్ కుతంత్రాల్లో భాగమే: దేవినేని
Devineni Slams Jagan

ఎన్టీఆర్ జిల్లా, జులై 14: మాజీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిపై (Former CM YS Jagan Reddy) మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు (Former Minister Devineni Uma Maheshwar Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు (సోమవారం) మీడియాతో మాట్లాడుతూ.. జగన్, వైసీపీ నేతలు తీవ్ర ఫస్ట్రేషన్‌లో ఉన్నారని.. అందువల్లనే రాష్ట్రంలో గందరగోళం సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. జగన్‌మోహన్ రెడ్డి, వైసీపీ నేతలకు ఏం పోయే కాలం వచ్చిందని దుయ్యబట్టారు. పల్నాడు, బంగారుపాళ్యం, గుడివాడ వంటి ఘటనలు జగన్ కుతంత్రాల్లో భాగమే అని ఆరోపించారు. అహంకారం, మదం, ఒళ్ళు బలుపుతో చంద్రబాబు నాయుడు వయస్సుపై, స్పీకర్ అయ్యన్న, కొల్లు రవీంద్రలపై పిచ్చికూతలు కూస్తున్నారని మండిపడ్డారు.


వైసీపీ నేతలకు ప్రజల్లోకి వెళ్లే దమ్ము ధైర్యం లేక పార్టీ మీటింగ్‌లు, ప్రెస్‌మీట్‌లు పెట్టి పిచ్చికూతలు కూస్తున్నారన్నారు. ఇటువంటి మాటలు మాట్లాడి జైల్లో పెడితే సానుభూతి పొందవచ్చని అనుకుంటున్నారన్నారని మండిపడ్డారు. ఇటువంటి వ్యాఖ్యలపై పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అమరావతిలో కొత్త బిట్స్ పిలానీ క్యాంపస్ ఏర్పాటు శుభసూచకమన్నారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి

గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు నియామకం

ఏడాదిగా కృషి.. గంజాయిని నియంత్రించాం: హోంమంత్రి అనిత

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 14 , 2025 | 04:54 PM