Share News

CM Chandrababu: భారత్ జోలికి ఎవరైనా వస్తే మటాష్ అయిపోతారు..

ABN , Publish Date - Apr 28 , 2025 | 02:13 PM

మే 2న ప్రధాని మోదీ అమరావతికి వస్తున్నారని, ప్రధాని చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభం కాబోతోందని సీఎం చంద్రబాబు అన్నారు. అప్పట్లో ఐటీని ప్రమోట్ చేశానని, ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నానని అన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ అటెండర్ ఉద్యోగానికి కూడా డిమాండ్ ఉండేదని, ఇప్పుడు...

CM Chandrababu: భారత్ జోలికి ఎవరైనా వస్తే మటాష్ అయిపోతారు..
CM Chandrababu

అమరావతి: హైదరాబాద్‌ (Hyderabad)లో 14 నెలల్లో హైటెక్ సిటీ (high-tech city) పూర్తి చేశామని, భవిష్యత్ అంతా ఐటీ (IT)దేనని అపట్లో పిలుపు ఇచ్చానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) అన్నారు. సోమవారం విట్ కాలేజ్‌ లో వి.లాంచ్ ప్యాడ్‌లో-2025 స్టార్ట్ అప్ ఎక్స్ పో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ బ్లాక్, వి.వి.గిరి బ్లాక్, దుర్గాబాయి దేశముఖ్ బ్లాక్ నూతన భవనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా భారతీయులుంటారని, అందులో అగ్రస్థానంలో తెలుగువారు ఉంటారని అన్నారు. తెలుగువాళ్ల జనాభా 5 శాతమే.. ఐఐటీల్లో సీట్లు మాత్రం 20 శాతం మనోళ్లవే అని వ్యాఖ్యానించారు.


మే 2న ఏపీకి ప్రధాని..

మే 2న ప్రధాని మోదీ అమరావతికి వస్తున్నారని, ప్రధాని చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభం కాబోతోందని సీఎం చంద్రబాబు అన్నారు. అప్పట్లో ఐటీని ప్రమోట్ చేశానని, ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నానని అన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ అటెండర్ ఉద్యోగానికి కూడా డిమాండ్ ఉండేదని, ఇప్పుడు ఐటీ ఉద్యోగానికే డిమాండ్ ఎక్కువగా ఉందని అన్నారు. విట్ అమరావతిలో 95 శాతం ప్లేస్‌మెంట్లు వస్తున్నాయని చంద్రబాబు అన్నారు.

Also Read: Guntur: ఎంపీ మిధున్ రెడ్డి బెయిల్ విచారణ వాయిదా..


భారత్ జోలికి వస్తే మటాష్

భారత్ జోలికి ఎవరైనా వస్తే మటాష్ అయిపోతారని, భారత్‌ను ఉగ్రవాదం ఏం చేయలేదని సీఎం అన్నారు. రాబోయే రోజుల్లో భవిష్యత్ అంతా AIదేనని, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పారదర్శకత తీసుకొచ్చామన్నారు. స్వర్ణాంధ్ర-2047కు రోడ్ మ్యాప్ సిద్ధం చేశామని చెప్పారు. పహల్గామ్‌లో ఉగ్రదాడి ఘటన దారుణమైందని, భారత్ జోలికి వస్తే మటాష్ అయిపోవాల్సిందేనని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రజలు సంఘటితంగా ఉండాలని, తీవ్రవాదం సమస్యలు భారత్‌ను ఏం చేయలేవని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్, తాడికొండ శాసన సభ్యులు తెనాలి శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నూతన మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర ఎన్నిక

హరి‌రామ్‌ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

For More AP News and Telugu News

Updated Date - Apr 28 , 2025 | 02:37 PM