Borugadda Anil Supreme Court: బోరుగడ్డ అనిల్‌కు సుప్రీంలో చుక్కెదురు
ABN , Publish Date - Apr 25 , 2025 | 02:48 PM
Borugadda Anil Supreme Court: వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. బెయిల్‌పై హైకోర్టులోనే తేల్చుకోవాలని ఉన్నతన్యాయస్థానం స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌కు (YSRCP Leader Borugadda Anil) సుప్రీంకోర్టులో (Supreme Court) ఎదురుదెబ్బ తగిలింది. బోరుగడ్డకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. తనపై ఉన్న అన్ని కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కోరుతూ బోరుగడ్డ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈరోజు (శుక్రవారం) సుప్రీంలో విచారణ జరిగింది. జస్టిస్ బి వి నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. దీనిపై హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. నకిలీ పత్రాలు సమర్పించి గతంలో బెయిల్ పొందినందుకు ఈ కేసును హైకోర్టే తేల్చుతుందని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో (CM Chandrababu Naidu) పాటు మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh), జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై (Depty CM Pawan Kalyan) అసభ్య పదజాలంతో దూషించిన కేసులో బోరుగడ్డను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇటీవల హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది. బోరుగడ్డను కొంతకాలం జైలులోనే ఉంచాలని, ఎలా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు అని ప్రశ్నించింది ధర్మాసనం. నకిలీ పత్రాలు సమర్పించి బెయిల్‌పై బయటకు వచ్చారంటూ బోరుగడ్డ బెయిల్ రద్దు చేయాలంటూ ఇటీవల పోలీసులు పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో తనపై నమోదైన అన్ని కేసుల్లో బెయిల్ ఇవ్వాలంటూ బోరుగడ్డ అనిల్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. జస్టిస్ బి వి నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరిగింది. అయితే అంశాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని, నకిలీపత్రాలు సమర్పించి గతంలో బెయిల్ పొందినందున ఈ కేసును హైకోర్టులోనే తేల్చుకోవడం మంచిదని సుప్రీం కోర్టు ధర్మాసనం అభిప్రాయపడుతూ బోరుగడ్డకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
కాగా.. చర్చ్ స్థల వివాదంలో సీఐను బెదిరించారంటూ బోరుగడ్డపై కేసు నమోదు అయిన నేపథ్యంలో ఇటీవల అతడిని అనంతపురం కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా కోర్టు వద్ద బోరుగడ్డ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెయిల్ కోసం తాను ఎలాంటి నకిలీ సర్టిఫికెట్లు పెట్టలేదని, ఒరిజినల్ సర్టిఫికెట్‌నే ఇచ్చినట్లు తెలిపారు. డాక్టర్ తనకు ఒరిజినల్ సర్టిఫికెట్ ఇచ్చారన్నారు. దీనిపై కోర్టులోనే నిజాలను తేల్చుకుంటానని చెప్పుకొచ్చారు. అవసరమైతే గూగుల్ టేక్ అవుట్ కూడా బయటకు తీసుకువస్తానని బోరుగడ్డ చెప్పడం సంచలనంగా మారింది.
ఇవి కూడా చదవండి
CM Yogi Emotional Video: శుభం కుటుంబాన్ని చూసి సీఎం యోగి కంటతడి.. వీడియో వైరల్
Sikkim: సిక్కింలో విరిగిపడిన భారీ కొండచరియలు.. చిక్కుకున్న 1000 మంది పర్యాటకులు..
Read Latest AP News And Telugu News