Inter Supplementary Results: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు శనివారం విడుదల
ABN , Publish Date - Jun 06 , 2025 | 01:30 PM
Inter Supplementary Results: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. విద్యార్థులు తమ ఫలితాలను https://resultsbie.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

Amaravati: ఏపీ (AP)లో అడ్వాన్స్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు (Inter Supplementary Results) శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంటర్ ప్రథమ (1st Year), ద్వితీయ సంవత్సరం (2nd Year) సప్లిమెంటరీ పరీక్షలు మే 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రెండు సెషన్లలో జరిగాయి. ఉదయం సెషన్లో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం సెషన్లో రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు తమ ఫలితాలను https://resultsbie.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఫలితాలు ఇలా తెలుసుకోండి..
ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను https://resultsbie.ap.gov.in/ వెబ్ సైట్లో చెక్ చేసుకోవచ్చు.
Step 1: విద్యార్థులు ఏపీ ఇంటర్ విద్యా మండలి అధికారిక వెబ్సైట్ https://resultsbie.ap.gov.in/ పై క్లిక్ చేయాలి.
Step 2: వెబ్సైట్ హోం పేజీ 'AP IPE ఫలితాలు 2025' అనే ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
Step 3: తర్వాత ఇంటర్ 1వ సంవత్సరం లేదా 2వ సంవత్సరం ఫలితాలపై క్లిక్ చేయండి. లాగిన్ విండో ఓపెన్ అవుతుంది.
Step 4: లాగిన్ విండోలో విద్యార్థి హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయండి.
Step 5 : స్క్రీన్‌పై ఇంటర్ ఫలితాలు డిస్ప్లే అవుతాయి. భవిష్యత్ అవసరాల కోసం ఇంటర్ మార్క్ షీట్ డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి నటరాజన్ కీలక భేటీ
ఘనంగా అఖిల్, జైనాబ్ల వివాహం..
For More AP News and Telugu News