Yoga Day Record: గిన్నిస్ బుక్ రికార్డ్.. చంద్రబాబు, లోకేష్ స్పందనిదే..
ABN , Publish Date - Jun 22 , 2025 | 11:08 AM
Guinness World Record: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖలో నిర్వహించిన యోగా దినోత్సవం ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసి సరికొత్త రికార్డు సృష్టించిందంటూ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రశంసలు కురిపించింది. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ పోస్ట్‌పై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ స్పందించారు.. వారు ఏమన్నారంటే..

Amaravati: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) విశాఖ (Visakha)లో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ (11th International Yoga Day) వేడుకల్లో (Celebrations) 3 లక్షల 105 మంది పాల్గొని సరికొత్త రికార్డ్ (Record) సృష్టించారంటూ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ (Guinness World Record) ప్రశంసలు కురిపించింది. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ పోస్ట్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu), మంత్రి నారా లోకేష్ (Minister Lokesh) స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు సోషల్ మీడియా ఎక్స్ (Social Media X) వేదికగా పోస్టు చేశారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లలో విశాఖ యోగాకు స్థానం దక్కడం ప్రతి ఒక్క ఆంధ్రుడుకు గర్వ కారణమని అన్నారు. ఈ రికార్డ్ ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరికీ దక్కుతుందని అన్నారు. ‘మీరందరు చూపించిన అంకితభావం అందరిలో స్ఫూర్తిని నింపింది. ఒక మంచి పని కోసం అందరం కలిసి పనిచేస్తే ఇటువంటి ఫలితాలు సాధించవచ్చని నిరూపించాం.. అందరికీ అభినందనలు’ అంటూ సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
మంత్రి నారా లోకేష్ స్పందన..
ప్రపంచ రికార్డులను ఆంధ్రప్రదేశ్ బ్రేక్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించిందని, బ్రాండ్ విశాఖ వేదికగా ఈ ఘనతను సాధించామని మంత్రి లోకేష్ అన్నారు. ఈ విజయంలో భాగస్వాములైన తెలుగుదేశం నాయకులు, శ్రేణులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. వేడుకను విజయవంతంగా నిర్వహించిన ప్రభుత్వ అధికారులు, ఈ అద్భుతమైన ఘనతను సాధించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలంటూ మంత్రి లోకేష్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
విశాఖ యోగాకు గిన్నిస్ బుక్‌లో స్థానం..
విశాఖ యోగాకు గిన్నిస్ బుక్‌లో స్థానం దక్కడం గర్వకారణమని.. 3,00,105 మందితో ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా విశాఖలో యోగా నిర్వహించి రికార్డ్ నమోదు చేశామన్నారు. ఏపీ ప్రభుత్వం నిర్వహించిన ఈ యోగాను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో పేర్కొన్న ఆ సంస్థ ట్వీట్‌ను మంత్రి నారా లోకేష్ రీట్వీట్ చేశారు. వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకోవడానికి కారకులైన వారందరికీ మంత్రి లోకేష్ మరొక్కసారి కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
హైదరాబాద్‌లో రెండు వేర్వేరు అగ్నిప్రమాదాలు..
అవినాష్ అనుచరుల వల్ల నాకు ప్రాణహాని..: సునీల్ కుమార్ యాదవ్
For More AP News and Telugu News