Share News

Amaravati Vision 2047: అమరావతి అభివృద్ధికి మీ అభిప్రాయం చెప్పండి.. ప్రజలకు సీఆర్డీఏ వినతి

ABN , Publish Date - Jun 24 , 2025 | 03:17 PM

Amaravati Vision 2047: 8600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దేశంలోనే అతి పెద్ద ప్రణాళిక ప్రాంతంగా అమరావతి ఉందని సీఆర్డీఏ వెల్లడించింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఏలూరు జిల్లాల్లోని 56 మండలాల పరిధిలో విస్తరించినట్లు తెలిపింది.

Amaravati Vision 2047: అమరావతి అభివృద్ధికి మీ అభిప్రాయం చెప్పండి.. ప్రజలకు సీఆర్డీఏ వినతి
Amaravati Vision 2047

అమరావతి, జూన్ 24: అమరావతి (AP Capital Amaravati) అభివృద్ధి విషయంలో ప్రజల నుంచి సీఆర్డీఏ (CRDA) సలహాలు, సూచనలు కోరింది. ఏపీ సీఆర్డీఏ విజన్ 2047 పేరుతో‌ ఆన్‌లైన్‌లో ప్రశ్నావళి రూపొందించింది సీఆర్డీఏ. విజన్‌లో అమరావతి ప్రాంత ప్రజలు భాగస్వామ్యులై తమ ఆలోచనలు, సూచనలు ప్రాధాన్యతలు, అభిప్రాయాలు చెప్పాలని విజ్ఞప్తి చేసింది. 8600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దేశంలోనే అతి పెద్ద ప్రణాళిక ప్రాంతంగా అమరావతి ఉందని సీఆర్డీఏ వెల్లడించింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఏలూరు జిల్లాల్లోని 56 మండలాల పరిధిలో విస్తరించినట్లు తెలిపింది.


మంగళగిరి, తాడేపల్లి లాంటి పట్టణాలతో పాటు 900 గ్రామాలున్న ప్రాంతమని పేర్కొంది. సీఆర్డీఏ విజన్ 2047పై పలు ప్రశ్నలు వేస్తూ సమాధానాలు ఇవ్వాల్సిందిగా ప్రజలను సీఆర్డీఏ అభ్యర్థించింది. కాగా.. ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమరావతి రాజధాని నిర్మాణాన్ని సీఆర్డీఏ ద్వారా నోడెల్ ఏజెన్సీగా నిర్మిస్తోంది. అమరావతి నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అంశాలకు సంబంధించి ప్రజల నుంచే సూచనలు, సలహాలు కోరేందుకు సీఆర్డీఏ ఓ లింక్‌ను రూపొందించింది. దానికి సంబంధించి ఓ ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసింది. విజన్ 2047 ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అనే విధంగా ప్రశ్నావళిని తయారు చేసింది. అమరావతి నిర్మాణం ఏ విధంగా ఉండాలని, పర్యావరణం ఎలా ఉండాలి వంటి అంశాలపై ప్రశ్నలను సిద్ధం చేసింది.


ముందుగా సీఆర్డీఏ ప్రాంతానికి చెందినవారా?.. ఇతర రాష్ట్రాలకు చెందినవారా? లేక విదేశాల్లో ఉంటున్నారా అనే అంశాన్ని ఓ ప్రశ్నగా ఇచ్చారు. ఆపై ఏపీ రాజధాని ప్రాంతానికి మొదటి మూడు ప్రాధాన్యతలు ఏంటి అంటూ మరో ప్రశ్న సంధించారు. వీటితో పాటు రాజధాని ప్రాంత ఆర్థిక వృద్ధికి వీటిలో ఏ అంశాలు ప్రధానంగా తీసుకోవాలి.. పరిశ్రమల అభివృద్ధా? వ్యవసాయమా? అంటూ రకరకాల ఆప్షన్స్ ఇస్తూ.. పది నుంచి పన్నెండు వరకు ప్రశ్నలను ప్రజలకు సీఆర్డీఏ సంధించింది. దీనికి సంబంధించిన లింక్‌ను రాష్ట్ర ప్రజలందరికీ కూడా చేరవేసే ప్రక్రియను సీఆర్డీఏ మొదలుపెట్టింది. అమరావతిలో పర్యావరణం, ఆర్థికపరమైన అభివృద్ధి తదితర అంశాలపై ప్రజల నుంచి వచ్చిన సూచనలు, సలహాల మేరకు ముందుకు వెళ్లాలని సీఆర్డీఏ భావిస్తోంది. గతంలో మాస్టర్ ప్లాన్‌ను రూపొందించిన తర్వాత బిల్డింగ్‌‌లకు సంబంధించి ప్రజల నుంచి సూచనలు, సలహాలు తీసుకున్న విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి

జగన్‌పై కేసు.. వైసీపీ నేతలకు నోటీసులు

ఆ ట్వీట్‌కు లోకేష్ క్విక్ రియాక్షన్.. వారికి సీరియస్ వార్నింగ్

అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ఇప్పుడు మరోలా.. జగన్‌పై షర్మిల ఫైర్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 24 , 2025 | 04:03 PM