Yuvatha Poru: వైసీపీ యువత పోరు అట్టర్ ప్లాప్..
ABN , Publish Date - Jun 23 , 2025 | 12:01 PM
Yuvatha Poru: కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు సోమవారం నెల్లూరులో వైసీపీ కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. నలభై మందితో ఆందోళన చేపట్టారు. పోలీసులను చూసి యువకులు చెల్లాచెదురయ్యారు.

Nellore: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) యువత ఆధ్వర్యంలో చేపట్టిన యువత పోరు (Yuvatha Poru) అట్టర్ ప్లాప్ (Rally Flop) అయింది. నెల్లూరు (Nellore) పాత జెడ్పీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేఖంగా కలెక్టరేట్ ఎదుట ఆందోళన (Protest) చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. పోలీసు (Police)లను చూసి యువకులు చెల్లాచెదురయ్యారు. నలభై మందితో ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ వైసీపీ కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు.
జనం దృష్టి మళ్లించడానికే ఈ డ్రామా..
మాజీ సీఎం జగన్ రెంటపాళ్ల పర్యటనకు వెళ్తుండగా.. ఆయన కారు వైసీపీ కార్యకర్త సింగయ్యను తొక్కేసిన ఘటన కలకలం రేపుతోంది. అక్కడ రప్పా రప్పా నరుకుతామని ప్లకార్డులు పెట్టిన కార్యకర్తను జగన్ వెనకేసుకురావడంపైనా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ వ్యవహారం నుంచి జనం దృష్టి మళ్లించడానికి ఆయన ఆకస్మికంగా సోమవారం ‘యువత పోరు’కు పిలుపిచ్చారు. నిరుద్యోగ భృతి హామీని సీఎం చంద్రబాబు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చేపట్టాలని వైసీపీ శ్రేణులను ఆదేశించారు.
ఇవి కూడా చదవండి:
సునీల్ కుమార్ ఫిర్యాదుతో ముగ్గురిపై కేసు
జగన్‌ను నమ్మి.. నష్టపోయి.. వైసీపీ కార్యకర్త ఆత్మహత్య
శాయ్ క్రీడా సంస్థ కోచ్‌పై పోక్సో కేసు
For More AP News and Telugu News