TDP Leader Parthasarathy Reddy : తప్పు చేసాను క్షమించండి : పార్థసారథి రెడ్డి
ABN , Publish Date - Jul 30 , 2025 | 04:45 PM
అమరావతి : టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందుకు పులివెందుల టీడీపీ నేత పార్థసారథి రెడ్డి హాజరయ్యారు. క్రమశిక్షణ కమిటీ నేతలు పల్లా శ్రీనివాస్, వర్ల రామయ్య, కొనకళ్ళ నారాయణలకు పార్థసారథి వివరణ ఇచ్చారు.

అమరావతి : టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందుకు పులివెందుల టీడీపీ నేత పార్థసారథి రెడ్డి హాజరయ్యారు. క్రమశిక్షణ కమిటీ నేతలు పల్లా శ్రీనివాస్, వర్ల రామయ్య, కొనకళ్ళ నారాయణలకు పార్థసారథి వివరణ ఇచ్చారు. ఇక నుంచి పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి నడుచుకుంటానని, దయచేసి క్షమించమని కమిటీని కోరారు. టీడీపీ అగ్ర నేతలపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్తున్నానని కమిటీ ముందు వేడుకున్నారు.
ప్రస్తుతం పార్థసారథి రెడ్డి ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఉపాధ్యాక్షుడిగా కొనసాగుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో పార్టీ అగ్ర నేతలకు వ్యతిరేకంగా పార్థసారథి రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం లేపాయి. దీంతో ఆగ్రహించిన టీడీపీ అధిష్టానం క్రమశిక్షణ సంఘం ముందుకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇవాళ(బుధవారం) పార్థసారథి రెడ్డి క్రమశిక్షణ సంఘం ముందుకు హాజరై వివరణ ఇచ్చారు.
Also Read..
Money Saving Tips: 210 రూపాయలతో 5000 హామీ.! ఈ ప్రభుత్వ స్కీం గురించి మీకు తెలుసా?
For More Telugu News and AP News..