Supreme Court: అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంలో విచారణ.. వాయిదా..
ABN , Publish Date - Apr 29 , 2025 | 11:31 AM
సిబిఐ అధికారి రాంసింగ్‌తో సహా సునీత దంపతులపై దాఖలైన కేసులో తాజా దర్యాప్తు నివేదికను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అందజేసింది. రాంసింగ్, సునీత దంపతులపై కావాలనే కేసు పెట్టారని, అవినాశ్ రెడ్డే ఇద్దరు పోలీసు అధికారులను అడ్డం పెట్టుకొని ఈ తతంగం అంతా నడిపారని ఆ నివేదికలో ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

న్యూ ఢిల్లీ: వైసీపీ కీలక నేత (TCP Leader), ఎంపీ అవినాశ్ రెడ్డి (MP Avinash Reddy) బెయిల్ రద్దు (Bail cancellation)పై మంగళవారం సుప్రీం కోర్టు (Supreme Court)లో విచారణ జరింది. బెయిల్ రద్దుపై ఏపీ ప్రభుత్వం (Govt) దాఖలు చేసిన అదనపు అపిడవిట్‌కు కౌంటర్‌కు సమయం కావాలని అవినాశ్ రెడ్డి తరపు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సిజెఐ సంజీవ్ ఖన్నా ధర్మాసనం జులై చివరి వారానికి విచారణను వాయిదా వేశారు. అప్పటికి తన పదవీకాలం ముగుస్తుండంతో వేరే ధర్మాసనానికి ఈ కేసు విచారణను బదిలీ చేస్తానని ఆయన తెలిపారు.
Also Read: వైసీపీ హయాంలో జరిగిన పాపాలు బయటకు..
కాగా సిబిఐ అధికారి రాంసింగ్‌తో సహా సునీత దంపతులపై దాఖలైన కేసులో తాజా దర్యాప్తు నివేదికను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అందజేసింది. రాంసింగ్, సునీత దంపతులపై కావాలనే కేసు పెట్టారని, అవినాశ్ రెడ్డే ఇద్దరు పోలీసు అధికారులను అడ్డం పెట్టుకొని ఈ తతంగం అంతా నడిపారని ఆ నివేదికలో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. అలాగే అవినాశ్ రెడ్డి బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేయడం, సాక్ష్యులను బెదిరించడం చేస్తారనడానికి ఇదే నిదర్శనమని, ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని సునీత తరపు న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా కోరారు. ఇరువైపు వాదనలను విన్న ధర్మాసనం తదుపరి విచారణ జులై చివరి వారానికి వాయిదా వేసింది.
కాగా వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి బెయిల్‌పై బయట ఉండగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం జరగదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ‘‘ మా బాబాయ్ హత్య కేసులో సాక్షులంతా ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. న్యాయం కోసం పోరాడుతున్న ఆయన కుమార్తె సునీతారెడ్డికి ఏమైనా అవుతుందేమోనని భయంగా ఉంది.. న్యాయం కోసం పోరాడుతున్న సునీతకు అండగా నిలబడతా. ఈ కేసు ఆమె ఎంతో పెద్దవాళ్లను ఎదుర్కొంటోంది. అందుకే నేను అమె పక్కనే నిలబడ్డా. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సునీతారెడ్డికి న్యాయం జరుగుతుందా.. ఆమె ప్రాణాలకు భద్రత ఉందా.. అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అవినాశ్ బెయిల్ రద్దు పిటిషన్‌పై ప్రభుత్వ అఫిడవిట్‌లో పలు అంశాలు ఉన్నాయి. దర్యాప్తు అధికారులను అవినాశ్‌రెడ్డి తన ఇంటికి పిలిపించి బెదిరించారని ఆ అఫిడవిట్‌లో ఉంది. వివేకానందరెడ్డిని సునీత, ఆమె భర్త కలసి హత్య చేసినట్లుగా తప్పుడు రిపోర్టు తయారుచేసి దానిపై అధికారులతో సంతకాలు అవినాశ్ సంతకాలు చేయించినట్టు అందులో ఉంది. అవినాశ్‌రెడ్డి బెయిల్ మీద బయట ఉండటం వల్లే సాక్ష్యాలను తారుమారు చేయగలుగుతున్నారు’’ అని షర్మిల తెలిపారు
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో నాయీ బ్రాహ్మణులకు ప్రభుత్వం శుభ వార్త..
గ్రూప్ -1లో పీఎస్సార్ చేసిన అక్రమాలపై కేసు
పాకిస్థాన్ దేశస్థులు భారత్‌ను వీడేందుకు చివరి రోజు..
For More AP News and Telugu News