Shocking Incident: కడపలో ఓ యువకుడు యువతిని బెదిరించి...
ABN , Publish Date - Jun 29 , 2025 | 08:00 AM
Crime News: కడప జిల్లా, దువ్వూరు మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. యువతిని ఓ యువకుడు బెదిరించి దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Kadapa Dist: మహిళల (Womens)పై రోజు రోజుకు అత్యాచారాలు, అఘాయిత్యాలు (Atrocities) పెరిగిపోతున్నాయి. చిన్నారుల నుంచి పండు ముసలి వరకు మృగాళ్లు మహిళలపై లైంగిక దాడులకు (sexual assault) తెగబడుతున్నారు. ప్రభుత్వం (Governent, పోలీసులు (Police) మహిళా భద్రతకు (Women safety) పెద్దపీట వేస్తున్నా.. షీటీమ్స్ (SHE Teams)ను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ పోకిరీల భరతం పడుతున్నా.. అరాచకాలు, అత్యాచారాలు మాత్రం తగ్గడంలేదు. చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి.
భారతదేశంలో 79వ ఇండిపెండెన్స్ డే వచ్చినా ఇంకా మహిళలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రం రాలేదు. ఒంటరి మహిళలమీద అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. రేపిస్టులు, హంతకులు ఏమాత్రం భయపడకుండా దారుణాలకు తెగబడుతున్నారు. దేశంలో నిర్భయ కాండలు జరుగుతూనే ఉన్నాయి.
తాజాగా కడప జిల్లా, దువ్వూరు మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతిపై వేణు అనే యువకుడు ఆమెను బెదిరించి అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై బాధితురాలు ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి వేణుతో పాటు కార్తీక్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
ఒకే వేదికపైకి ఉద్ధవ్ ఠాక్రే.. రాజ్ ఠాక్రే..
For More AP News and Telugu News