Share News

MLA Madhavi Reddy: పీఏపై ఆరోపణలు.. స్పందించిన ఎమ్మెల్యే

ABN , Publish Date - Apr 27 , 2025 | 08:21 PM

MLA Madhavi Reddy: తన పీఏ వాహిద్‌పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డితోపాటు ఆమె భర్త, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి స్పందించారు.

MLA Madhavi Reddy: పీఏపై ఆరోపణలు.. స్పందించిన ఎమ్మెల్యే
Kadapa MLA Madhavi Reddy

కడప,ఏప్రిల్ 27: కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి పీఏ వాహిద్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అతడిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు. వాహిద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఎమ్మెల్యే మాధవి రెడ్డి సూచించారు. ఎమ్మెల్యే పీఏ వాహిద్‌పై ఆరోపణలు రావడంతో.. వారు వెంటనే స్పందించారు.

ఇంతకీ ఏం జరిగిందంటే..

ఉద్యోగం పేరుతో ఒంటరి మహిళను మోసం చేసి కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి పిఏ వాహిద్ రెండవ వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఉద్యోగంతోపాటు నగదు ఇస్తానని నమ్మించి వివాహం చేసుకున్నాడు. ఇలా మరో ముగ్గురు అమ్మాయిలను ఎమ్మెల్యే పీఏ ట్రాప్ చేసినట్లు బాధితులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఓ బాధితురాలి సోదరుడు తమకు న్యాయం చేయాలని వాహిద్‌ను కోరాడు. ఈ నేపథ్యంలో అతడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తన సోదరుడిపై దాడి చేశాడంటూ బాధితురాలి ఆరోపించింది.


దీంతో ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకు వెళ్లినా.. తమకు న్యాయం జరగలేదని సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. దాంతో వారు ఎమ్మెల్యే మాధవి రెడ్డి నివాసానికి బాధితులు వెళ్లారు. ఆ క్రమంలో వాహిద్ వల్ల తమంతా బాధితులుగా మారామని ఎమ్మెల్యే ఎదుట సదరు మహిళలు గోడు వెళ్లబోసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మాధవీ రెడ్డితోపాటు ఆమె భర్త టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి పై విధంగా స్పందించారు. మరోవైపు ఎమ్మెల్యే కార్యాలయంలో తనను చెల్లిగా వాహీద్ పరిచయం చేశాడని సదరు మహిళ వివరించింది.

ఈ వార్తలు కూడా చదవండి..
BRS Meeting In Elkathurthy: బీఆర్ఎస్ సభలో రసాభాస..

Congress party: ఏపీలో కాంగ్రెస్ పార్టీ నేత దారుణ హత్య

Visakhapatnam: యాప్‌లతో ఆర్థిక నేరాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టు రట్టు

AP Police: పోలీసులను చూసి.. ఆ దొంగ ఏం చేశాడంటే..

Rains: ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన వరి ధాన్యం

Simhachalam: స్వామి చందనోత్సవం.. సమీక్షించిన హోం మంత్రి

TDP Supporter: రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తకు కత్తిపోట్లు

For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 27 , 2025 | 08:21 PM